రాష్ట్రీయం

నిరుపేదలకు అండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, జూలై 21: నిరుపేదలు, దిక్కులేనివారు చనిపోతే అంత్యక్రియలకు ప్రభుత్వం 30వేలు ఆర్థిక సాయం అందిస్తుందని సిఎం చంద్రబాబు ప్రకటించారు. వారి మరణం గౌరవప్రదంగా ఉండేలా సంతాప సభలు కూడా ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉన్నామన్నారు. సొంత నియోజకవర్గమైన కుప్పంలో రెండోరోజు పర్యటనలో భాగంగా శుక్రవారం పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈసందర్భంగా కుప్పం మార్కెట్ యార్డులో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ కుప్పంలో ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు చర్యలు చేపట్టామని, ఎదురైన అవాంతరాలను అధిగమించి విమానాశ్రయం ఏర్పాటు చేస్తామన్నారు. పేదల సంక్షేమానికి నిరంతరం శ్రమిస్తున్నామని, ప్రతి కుటుంబానికి నెలకు పది వేలు రావాలన్నదే తమ ప్రభుత్వ ఆశయమన్నారు.
ఈ దిశగానే ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. మరుగుదొడ్లు నిర్మించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని, దీనికోసం ప్రభుత్వం 15వేలు ఆర్థిక సాయం అందిస్తుందన్నారు. అయితే పలుచోట్ల వీటి నిర్మాణంపై ప్రజలు మొగ్గు చూపడం లేదన్నారు. భవిషత్‌ను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఇంటికి మరుగుదొడ్డి తప్పనిసరి అన్నారు. నిర్మించుకోని వారి ఇంటి ముందు స్థానికంగా ఉన్న పిల్లలతో ఆందోళన చేయిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వానికి ఇసుక ద్వారా 700 కోట్లు ఆదాయం వస్తున్నా, పేదవారికి అండగా ఉండాలన్న సంకల్పంతో ఇసుకను ఉచితం చేశామన్నారు. అయితే అందులోనూ కొందరు అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని, సంపదను దోచుకునేందుకు చూస్తున్నారన్నారు. ఇలాంటి వారిని ఎట్టి పరిస్థితిలోనూ ఉపేక్షించే ప్రశక్తే లేదని తేల్చి చెప్పారు. ఎక్కడైనా బెల్టుషాపులు కొనసాగుతుంటే వెంటనే 1100 నెంబరుకు ఫోన్ చేసి సమాచారమిస్తే, వారి తాట తీస్తామని చెప్పారు. అంగన్‌వాడిలతో పాటు పాఠశాలలను సైతం ప్రక్షాళన చేసేలా చర్యలు చేపట్టామన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక కార్యచరణ ప్రణాళిక సిద్ధం చేశామని, ప్రతి గ్రామానికి సిసి రోడ్డుతోపాటు కనీస సౌకర్యాలు కల్పించే దిశగా చర్యలు చేపట్టామన్నారు. ప్రతి ఇంటిని నాలెడ్జ్ హోంగా తయారు చేస్తామన్నారు. దీనివల్ల ప్రతి ఒక్క అంశాన్ని టీవిలో చూసుకొని పరిజ్ఞానాన్ని పెంచుకునే విధంగా చర్యలు చేపట్టనున్నామన్నా రు. చదువుతో అభివృద్ధి సాధ్యమని, ఈ దిశగానే రాష్ట్రంలో విద్యారంగానికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. వ్యవసాయరంగంపైనా ప్రత్యేక దృష్టి నిలిపామని, ప్రతి ఒక్కరూ కరవును జయించడానికి నిర్దేశించిన పంట సంజీవిని, నీరు- ప్రగతి పనులపై ఆశక్తి చూపి భూగర్భ జలాలు పెంచే చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధానంగా వాణిజ్య పంటలపైనా రైతులు మక్కువ చూపితే మంచి లాభాలను సాధించవచ్చన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటుకూ చర్యలు చేపట్టి అనేకమంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి చర్యలు తీసుకున్నామని తెలిపారు.

చిత్రం.. హంద్రీ-నీవా ప్రాజెక్టు పనులను హెలికాప్టర్ నుంచి పరిశీలిస్తున్న సిఎం చంద్రబాబు