రాష్ట్రీయం

2011 గ్రూప్-1 ఇంటర్వ్యూలు తుది తీర్పునకు లోబడి ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 21: ఏడేళ్ల క్రితం నాటి నోటిఫికేషన్ ప్రాతిపదికగా నిర్వహించిన గ్రూప్-1 ఎంపిక పరీక్ష ఇంటర్వ్యూల దశకు చేరుకుంది. అయితే ఈ ఇంటర్వ్యూల అనంతరం ఎంపిక జాబితా తామిచ్చే ఇచ్చే తీర్పు నియమనిబంధనలకు లోబడి ఉండాలని మరో మారు రాష్ట్ర హైకోర్టు శుక్రవారం నాడు వ్యాఖ్యానించింది. 15/2011, 18/2011 నోటిఫికేషన్ల ఆధారంగా జరుగుతున్న గ్రూప్-1 ప్రక్రియలో మెయిన్స్‌లో ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 24 నుండి వౌఖికపరీక్ష నిర్వహిస్తున్నట్టు పబ్లిక్ సర్వీసు కమిషన్ కార్యదర్శి ఎ వాణి ప్రసాద్ చెప్పారు. వౌఖిక పరీక్షకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఇప్పటికే టిఎస్‌పిఎస్‌సి వెబ్ పోర్టల్‌లో ఉంచారు. అభ్యర్థులు ఏ రోజు ఎవరు హాజరుకావాలనే వివరాలు ఇందులో ఉన్నాయని, అందుకు తగ్గట్టు అభ్యర్థులు సిద్ధం కావాలని సూచించారు.
గ్రూప్-1 ఇంటర్వ్యూ బోర్డులో ఐఎఎస్‌లు
తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ నిర్వహించే గ్రూప్-1 ఇంటర్వ్యూ బోర్డులో ఐఎఎస్‌లు సభ్యులుగా చేర్చుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్‌పి సింగ్ జీవో 1554ను జారీ చేశారు. ఆయా శాఖల ముఖ్యకార్యదర్శులు బోర్డులో సభ్యులుగా ఉండాలని, ఒక వేళ వారు లేకున్న పక్షంలో సంబంధిత శాఖాధిపతిని వారి తరఫున నామినేట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీని ద్వారా ఆయా శాఖల్లో జరుగుతున్న ఎంపికకు సంబంధించి స్పష్టత ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.