రాష్ట్రీయం

ఎంతైనా శ్రమిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, జూలై 22: రాష్ట్ర విభజన సహేతుకంగా జరగలేదు. రాజధాని నగరం లేకుండా అప్పులతో బయటకు వచ్చాం. ఆ సమయంలో నన్ను నమ్మి ప్రజలు అధికారం అప్పగించటంతో ధైర్యంగా ముందడుగు వేశాం. అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నాం. ఎంతైనా శ్రమిస్తా. రాష్ట్భ్రావృద్ధే ప్రధాన అజెండా అని సిఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. కర్నూలు జిల్లా నంద్యాలలో శనివారం నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. ఇష్టానుసారం రాష్ట్ర విభజనకు పాల్పడిన కాంగ్రెస్ కనుమరుగైంది. వాళ్లు చేసిన నష్టాన్ని అధిగమించాలంటే కష్టపడాలి. లేదంటే ఎనే్నళ్లయినా రాష్ట్రం ఏ రంగంలోనూ కుదుటపడే పరిస్థితి ఉండదన్నారు. విభజన అనంతరం తనకున్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రజలు అధికారం అప్పగించారన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయకుండా అనుక్షణం రాష్ట్భ్రావృద్ధికి తపిస్తున్నట్టు వివరించారు. తనతోపాటు మంత్రివర్గం కష్టపడుతుండటంతో రాష్ట్రం క్రమేణా కోలుకుంటోందని తెలిపారు. సాగునీరు, సాంకేతిక పరిజ్ఞానం, పరిశ్రమలకు సమాన ప్రాధాన్యతనిస్తూ విదేశాల్లో స్వయంగా ఫైళ్లు పట్టుకుని పెట్టుబడుల కోసం తిరిగానన్నారు. దీని ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. అయితే దీన్ని జీర్ణించుకోలేని వైకాపా అధినేత జగన్ అధికార కాంక్షతో అభివృద్ధిని, ప్రభుత్వ వేగాన్ని అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఇబ్బందులు సృష్టించారని మండిపడ్డారు. రాజధాని సహా తాము అభివృద్ధి కోసం తీసుకున్న ప్రతి చర్యపై కోర్టు కేసులు, పర్యావరణ సమస్యలంటూ ఫిర్యాదులు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఎక్కడా ప్రభుత్వ పనితీరుపై వ్యతిరేకత ఎదురు కాకపోవడంతో మతాలను, కులాలను రెచ్చగొట్టారని, ప్రాంతీయ సమస్యలు సృష్టించే ప్రయత్నం చేయగా అక్కడా ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురుకావడంతో ఆయన మరో ఎత్తుగడ వేయడం కోసం ఇతర రాష్ట్రీయులను రప్పించుకున్నారని ఎద్దేవా చేశారు.
రాష్ట్భ్రావృద్ధికి ప్రజల నుంచి అందుతున్న సహకారం తాను మరువలేనని చంద్రబాబు అన్నారు. అర్హులైన ప్రజలందికీ రేషన్‌కార్డులు, పించన్లు ఇవ్వడం తన లక్ష్యమన్నారు. ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లు ఉండాలన్న ఉద్దేశంతో పక్కా గృహ నిర్మాణాల నిర్మాణం వేగవంతం చేశామన్నారు. తొలి దశ నిర్మాణాలు రానున్న 15 నెలల్లో పూర్తి చేస్తామన్నారు. మహిళల ఆర్థికాభివృద్ధికి పొదుపు సంఘాలకు చేయూతనందిస్తూ స్వయం సాధికారత దిశగా ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. బీడీ కార్మికులు తక్కువ వయస్సులోనే అనారోగ్యానికి గురవుతున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని, 50 ఏళ్లు నిండినవారికి నెలకు రూ.వెయ్యి పించను ఇస్తామని ప్రకటించారు. ఇక 7వ తరగతి వరకు చదువుకున్న నిరుద్యోగులకు డ్రైవింగ్‌లో శిక్షణ ఇప్పించి లైసెన్సులు మంజూరు చేస్తామని తెలిపారు. హంద్రీ- నీవా పనులను రానున్న ఏడాదిలో పూర్తిచేసి చిత్తూరు జిల్లా కుప్పం వరకు సాగు జలాలు, మంచి నీటిని అందించే పనులు వేగవంతం చేశామన్నారు. రాష్టవ్య్రాప్తంగా ప్రతి ఎకరాకు సాగునీరు, ప్రతి ఒక్కరికి సురక్షితమైన మంచి నీరు అందించడం కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. తనకు అన్ని జిల్లాలూ సమానమేనని, ఎక్కడ ఏ వనరులు ఉంటే వాటిని సద్వినియోగం చేసుకుంటూ ఆయా ప్రాంతాల్లో పరిశ్రమల స్థాపనకు తీవ్రంగా కృషి చేస్తున్నానని అన్నారు. సభలో ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి, పలువురు మంత్రులు, ఎంపి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

చిత్రం.. సిఎం చంద్రబాబు