రాష్ట్రీయం

కెయులో మోడల్ కెరీర్ సెంటర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జూలై 22: కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు, నిరుద్యోగ యువతకు శిక్షణ, అవగాహన కార్యక్రమాలు, ఉపాధి ఉద్యోగ సమాచారం అందించే మోడల్ కెరీర్ సెంటర్ మంజూరుకు కృషి చేస్తానని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనాశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. శనివారం తెలంగాణ విద్యార్థి సేనా అధ్వర్యంలో కెయులో మోడల్ కెరీర్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని కోరుతూ నగరానికి వచ్చిన కేంద్ర మంత్రి దత్తాత్రేయను కలిసి వినతి పత్రం సమర్పించారు. కేంద్ర మంత్రిత్వశాఖ ద్వారా ఇప్పటికే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రారంభించారని, కరీంనగర్, కొత్తగూడెం, ఖమ్మంలలో ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారని టివిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు తిరునహరి శేషు అన్నారు. అదే విధంగా గ్రామీణ పేద, మద్యతరగతి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు విద్యార్థులు ఎక్కువగా చదువుకునే కెయులో మోడల్ కెరీర్ సెంటర్‌ను ప్రారంభించాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. స్పందించిన కేంద్రమంత్రి మోడల్ కెరీర్‌కు సంబంధించిన అంశాలను విశ్వవిద్యాలయ అధికార యంత్రాగం కేంద్ర మంత్రిత్వశాఖకు పంపాలని తెలిపారు.