రాష్ట్రీయం

ఆచార్య ఎన్.గోపికి దాశరథి పురస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 22: పిన్న వయస్సులో సమాజాన్ని ప్రభావితం చేసిన గొప్ప వ్యక్తి డా.దాశరథి అని స్పీకర్ మధుసూదనాచారి అన్నారు. ప్రభుత్వ సలహాదారు డా.కె.వి.రమణాచారి అధ్యక్షతన డా.దాశరథి 93వ జయంతి ఉత్సవాల సందర్భంగా దాశరథి సాహితీ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం శనివారం రవీంద్రభారతిలో జరిగింది. ఈ సందర్భంగా డా.దాశరథి సాహితీ పురస్కారాన్ని పలువురు వక్తలు, అమాత్యుల చేతుల మీదుగా ఆచార్య ఎన్. గోపికి బహూకరించారు. ఈ సందర్భంగా స్పీకర్ మధుసూదనాచారి మాట్లాడుతూ, దాశరథి గొప్ప సాహితీ వేత్త అని కొనియాడారు. తెలంగాణ శాసన మండలి చైర్మన్ స్వామీగౌడ్ మాట్లాడుతూ కవులకు ప్రభుత్వమే గౌరవ సన్మానాలు అందజేస్తున్నందుకు ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. స్పీకర్ మదుసూధనచారి మాట్లాడుతూ 23 సంవత్సరాల వయస్సులో సమాజాన్ని ప్రభావిత చేయగలిగిన రచనలు చేసిన గొప్ప సాహితీ వేత్త దాశరథి అని అన్నారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ డా.దాశరథి అరుదైన కవి అని, ఎల్లవేళలా విప్లవ సాహిత్యాన్ని రచించి తద్వారా పాలకులను ప్రశ్నించిన గొప్ప పోరాట యోధుడని కొనియాడారు. దాశరథి పేరిట పురస్కారాన్ని నెలకొల్పి కవులను గౌరవించే సంస్కృతిని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక మండలి చైర్మన్ రసమయి బాలకిషన్, తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్ నందిని సిధారెడ్డి, అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్‌రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ్ధర్, తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడు ఎస్వీ సత్యనారాయణ పాల్గొన్నారు.

చిత్రం.. డా.దాశరథి సాహితీ పురస్కారాన్ని అందుకుంటున్న ఆచార్య ఎన్.గోపి