రాష్ట్రీయం

నీటి వనరుల డిజిటలైజేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 23: సాగునీటి వనరుల సమగ్ర సమాచారాన్ని శాటిలైట్‌కు అనుసంధానం చేసి ప్రాజెక్టుల నిర్వహణ, నీటి మట్టం, నీటి పంపిణీ, ఆయకట్టు పరిధిలోని పంటల పరిస్థితిని ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాలని నీటిపారుదల శాఖ నిర్ణయించింది. అలాగే ఇప్పుడు కొనసాగుతున్న ప్రాజెక్టు పనుల పర్యవేక్షణ, నాణ్యతాప్రమాణాలపై నిరంతరం నిఘా పెట్టాలని నిర్ణయించింది. కోటి 20 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే బృహత్ ప్రణాళిక అమలు, తీసుకోవాల్సిన చర్యలపై నీటిపారుదలశాఖ మంత్రి టి హరీశ్‌రావు శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో పది గంటల పాటు నిర్వహించిన మేధోమధనంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం సాగునీటి వ్యవస్థను ఉపగ్రహానికి (శాటిలైట్) అనుసంధానం చేసి ఆన్‌లైన్ ద్వారా ఇక నుంచి నీటి వనరులను నిర్వహించాలని నిర్ణయించారు. ఇప్పటికే 45,222 చిన్న వనరులైన చెరువులకు జియో ట్యాగింగ్ చేయడం పూర్తి అయిందని మంత్రి హరీశ్‌రావు వివరించారు. అలాగే 55్భరీ, మధ్యతరహా ప్రాజెక్టుల డిజిటలైజేషన్ పూర్తి అయిందన్నారు. ప్రాజెక్టుల్లో నీటి నిలువలు, నీటి పంపణీ, ఆయకట్టు కింద సాగుచేసిన పంటల వివరాలు వంటి సమగ్ర సమాచారాన్ని ఆన్‌లైన్ ద్వారా తెలుసుకొని ఎప్పటికప్పుడు పరిస్థితిని విశే్లషించుకుంటూ తదుపరి చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. ఆన్‌గోయింగ్ ప్రాజెక్టుల పనుల నాణ్యతపై ప్రత్యేక దృష్టిసారించాలని, వీటిని జాయింట్ ఇంజనీర్లు ప్రతిరోజు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు రెండు రోజులకు ఒకసారి, సూపరింటెండెంట్ ఇంజనీర్లు ఆకస్మీక తనఖీలు నిర్వహిస్తూ అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. బంగారు తెలంగాణ కల సాకారం చేయడంలో ప్రాజెక్టులదే ప్రధాన పాత్ర అన్నారు. రాష్ట్రంలో కోటి 20లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే బృహత్ ప్రణాళిక కార్యరూపం దాల్చేందుకు ప్రతి ఒక్కరూ అంకిత భావంతో కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. సింగూరు ప్రాజెక్టు కింద నిరుడు 35వేల ఎకరాలకు సాగునీటిని అందించడంతో వలసలు వెళ్లిన ఆయకట్టు రైతులు తిరిగి గ్రామానికి చేరుకున్నారని మంత్రి గుర్తు చేశారు. సాగునీటికి, గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి ఉన్న అవినాభావ సంబంధాన్ని ఎల్లప్పుడు గుర్తెరెగి నడుచుకోవాలన్నారు. ప్రాజెక్టులు, డ్యామ్‌ల భద్రత కూడా అత్యంత ముఖ్యమైందని, భద్రతపై నిఘా వ్యవస్థను పోలీసు శాఖకు అనుసంధానం చేయాలన్నారు. డ్యామ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రోగ్రామ్(డిఆర్‌ఐపి) పథకం కింద ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయాన్ని అందించనుండటంతో వచ్చే నెల ఆగస్టు 10వరకు సమగ్ర అంచనాలతో ప్రతిపాదనలు సకాలంలో కేంద్రానికి పంపించాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. భారీ వర్షాలు, వరదల సమయంలో తీసుకోవాల్సిన చర్యల పట్ల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రాజెక్టుల నిర్వహణను మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆన్‌లైన్ ద్వారా నిర్వహించే విధానాన్ని రాష్ట్రంలో కూడా త్వరలో అమలులోకి తీసుకొస్తున్నామన్నారు.

చిత్రం.. ఆదివారం ఉన్నతాధికారుల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు