రాష్ట్రీయం

ఆల్మట్టికి పెరుగుతున్న వరదనీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, జూలై 23: ఎగువ ప్రాం తంలోని మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణానది పరీవాహక ప్రాం తాలలో నిర్మించిన ఆల్మట్టి జలాశయానికి ఆదివారం పెద్ద ఎత్తున వరదనీరు వచ్చి చేరుతున్నట్టు జూరాల వరద నియంత్రణ కార్యాలయ అధికారులు తెలిపారు. ఆల్మట్టి జలాశయానికి ఎగువ ప్రాంతం నుండి 1,30,148 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టులో నీటి ఉద్ధృతి పెరుగుతోంది. 129.72 టిఎంసిల సామర్థ్యంగల ఆల్మట్టి జలాశయంలో ప్రస్తుతం 78.91 టిఎంసిల నీరునిల్వ ఉంది. ఒకే రోజు 8 టిఎంసిల నీరు ప్రాజెక్టులోకి చేరుకుంది. ఎగువ ప్రాంతం నుండి వస్తున్న వరద నీటిని దృష్టిలో ఉంచుకొని అక్కడి అధికారులు విద్యుత్ ఉత్పత్తి నిమిత్తం 33 వేల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. నారాయణపూర్ జలాశయం 37.646 టిఎంసిల సామర్థ్యం కలిగి ఉండగా ప్రస్తుతం 26.61 టిఎంసిలు నిల్వ ఉంది.
నారాయణపూర్ జలాశయానికి ఎగువ ప్రాంతం నుండి 30,966 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. జూరాల ప్రాజెక్టులో ప్రస్తుతం 6.823 టిఎంసిల నీరు నిల్వ ఉన్నట్టు అధికారులు తెలిపారు.