రాష్ట్రీయం

మహారాష్ట్ర సరిహద్దులో ప్రేమజంట హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుభీర్, జూలై 23: నిర్మల్ జిల్లా కుభీర్ మండలానికి సమీపంలోని మహారాష్ట్ర సరిహద్దులో ఆదివారం ప్రేమజంట దారుణహత్యకు గురైంది. తన చెల్లెలు పెళ్లయన కొద్ది రోజులకే భర్తను కాదని ప్రియుడితో కలిసి పారిపో వడాన్ని సహించలేని అన్న చెల్లి, ఆమె ప్రియుడిని దారు ణంగా హత్య చేశా డు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నా య. పూజ (20), గోవింద్ (25) అనే ఇద్దరు ప్రేమికులు. బోకర్ తాలూకాలోని పేర్వాన్ గ్రామానికి చెందిన వారు. అయతే పూజకు కొద్ది రోజుల క్రితమే వివాహం అయంది. అయతే పెళ్లి ఇష్టంలేని పూజ శనివారం ప్రియుడితో ఇంటి నుండి బయటకు వెళ్లిపోయారు. పూజ కుటుంబీకులు బోకర్ పోలీసులకు ఫిర్యాదుచేయడంతో వారు మిస్సింగ్ కేసుగా నమోదుచేశారు. ప్రేమికులు ఒకరోజు తానూర్ గ్రామానికి వెళ్లినట్టు సోదరుడు రాపెన్ దిగంబర్ తెలుసుకుని వారిని స్వగ్రామానికి తీసుకువెళ్తున్నట్టు నమ్మించాడు. కుభీర్ మండల సరిహద్దు దాటగానే వారిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి గోవింద్‌ను హత్యచేశాడు.
చెల్లెలు పూజ గొంతు కూడా కోయడంతో ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి రోడ్డుపై పడి మృతిచెందింది. హంతకుడు పూజ స్వయాన సోదరుడు. తెలంగాణ, మహారాష్ట్ర పోలీసులు సరిహద్దులు తెలుసుకోవడానికే పోలీసులకు గంటకుపైగా సమ యం పట్టింది. పూజ సోదరుడు దిగంబర్ బోకర్ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడని మహారాష్ట్ర పోలీసులు తెలిపారు.