ఆంధ్రప్రదేశ్‌

సినిమా రంగానే్న టార్గెట్ చేయడం సరికాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 24: డ్రగ్స్ కేసులో కేవలం సినిమా రంగానే్న టార్గెట్ చేయడం సరికాదని సినీ నటుడు, దర్శక నిర్మాత ఆర్.నారాయణ మూర్తి తెలిపారు. వెలగపూడి సచివాలయం వద్ద ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ దమ్ముంటే ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అందరినీ విచారణ చేయాలన్నారు. సినిమాలు తీసే తమకే సిట్ అధికారులు సినిమా చూపిస్తున్నారన్నారు. మాదక ద్రవ్యాలు మహమ్మారిగా మారి యువతను నిర్వీర్యం చేస్తున్నాయన్నారు. డ్రగ్స్ వ్యవహారం గత 30 సంవత్సరాలుగా ఉందని, అప్పటి నుంచే చర్యలు తీసుకుని ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదన్నారు. శిక్షించడం అవసరమేనని, కేవలం ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ఈ తీరున ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. డ్రగ్స్ వాడుతున్న వారిలో వ్యాపారవేత్తలు, రాజకీయ నేతలు, ఉన్నతాధికారుల పిల్లలూ ఉన్నారని తెలిపారు. అంతమందిని వదిలేసి సినిమా వాళ్లను ఫోకస్ చేయడం సరికాదన్నారు. ఒక వైపు సిగరెట్, మద్యం తాగకూడదంటూ ప్రకటనలు ఇస్తూ, వాటి అమ్మకాలకు ప్రభుత్వాలు అనుమతిస్తున్నాయని గుర్తు చేశారు. ఒక రాష్ట్రంలో గుట్కా, సారా అమ్మకాలకు అనుమతి ఉంటుందని, మరో రాష్ట్రంలో నిషేధం అమల్లో ఉంటుందన్నారు. ప్రభుత్వం కూడా ఆదాయం కోసం మత్తుపదార్థాల అమ్మకాలను ప్రోత్సహిస్తోందన్నారు. విశాఖలో గంజాయి విక్రయాల్లో పెద్ద నాయకులు ఉన్నారని, వారిపై ఎందుకు చర్య తీసుకోరని ప్రశ్నించారు.