రాష్ట్రీయం

‘విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, జూలై 24: తెలంగాణ ప్రభుత్వం విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో వ్యాధుల నిర్మూలనకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు ప్రజలకు వైద్య సేవలు అందించడంలో పూర్తిగా విఫలమయ్యాయని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందించేలా చర్యలు చేపట్టామన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రులు సోమవారం విస్తృతంగా పర్యటించారు. భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా నిర్మించిన 100 పడకల ఆసుపత్రి భవనాన్ని, మణుగూరులో నిర్మించిన 100 పడకల ఆసుపత్రిని వారు లాంఛనంగా ప్రారంభించి, ప్రజలందరికీ ఉచిత వైద్యం అందించి ఆరోగ్యకర తెలంగాణ సాధించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో వ్యాధులతో గిరిజనులు మృత్యువాత పడుతున్నారని, దీనిపై ప్రత్యేక దృష్టిసారించి ఈ మూడేళ్ల కాలంలో ఫలితాలు సాధించామన్నారు. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిని కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్ది సకల సదుపాయాలు, సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నామని, రానున్న రెండేళ్లలో వైద్యరంగంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా ఉంచుతామన్నారు. మూత్రపిండాల వ్యాధిగ్రస్తుల కోసం రాష్ట్రంలో 40 డయాలసిస్ కేంద్రాలు, అత్యవసర వైద్యం కోసం 20 ఐసియూ కేంద్రాలను త్వరలో ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని వారు తెలిపారు. ప్రజలు వైద్యం కోసం నగరాలు, పట్టణాలకు వెళుతుంటే ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని, పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పౌరుడు ఆరోగ్యంగా ఉండేందుకు ఎంత ఖర్చైనా వెచ్చిస్తామని తెలిపారు. భద్రాచలం ఐటిడిఏలో నిర్వహించిన వైద్య ఆరోగ్య శాఖ సమీక్షా సమావేశంలో పాల్గొన్న మంత్రులు ప్రభుత్వ ఆసుపత్రులను ప్రజలు నమ్మే రోజులు దగ్గర్లో ఉన్నాయని, ఆ నమ్మకాన్ని కలిగించడంలో వైద్యులు కృషి చాలా అవసరమని అభిప్రాయపడ్డారు. అనంతరం మంత్రి లక్ష్మారెడ్డి భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామిని దర్శించుకున్నారు.

చిత్రం.. భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో కొత్తగా నిర్మించిన
వంద పడకల భవనాన్ని ప్రారంభిస్తున్న మంత్రులు తుమ్మల, లక్ష్మారెడ్డి