రాష్ట్రీయం

మరో డ్రగ్స్ ముఠా అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 24: హైదరాబాద్‌లో మాదకద్రవ్యాల వ్యవహారం సంచలనం సృష్టించిన నేపథ్యంలో మరో డ్రగ్ ముఠా పట్డుబడింది. సోమవారం ఐదుగురు నైజీరియన్లను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఒక వైపు డ్రగ్స్ కేసు విచారణ జరుగుతుండగానే మరో డ్రగ్ ముఠా పట్టుబడడం కలకలం రేపుతోంది. డ్రగ్స్ అమ్ముతున్నారని పక్కా సమాచారంతో సైబరాబాద్ పరిధిలోని జవహర్‌నగర్‌లో పోలీసులు సోదాలు చేపట్టారు. ఓ ఇంటిపై దాడి చేసి ఐదుగురు నైజీరియన్లను అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్, గంజాయితోపాటు రూ. 2 లక్షలు నగదును స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు నైజీరియన్ల ముఠాలో విజయవాడకు చెందిన ఓ యువతిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా డ్రగ్స్ విక్రయంతోపాటు వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. వీరి వద్ద నుంచి 20 గ్రాముల కొకైన్, 12 గ్రాముల బ్రౌన్ షుగర్, ఇతర మత్తు పదార్థాలు, మూడు ల్యాప్‌టాప్‌లు, 9 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు రాచకొండ కమిషనర్ మహేశ్ ఎం భగవత్ మీడియాకు తెలిపారు. కాస్మాస్ ఫ్లాట్‌పై ఎస్‌వోటి పోలీసులు దాడి చేసి నిందితులను పట్టుకున్నారని తెలిపారు. గోవా నుంచి డ్రగ్స్ తీసుకువచ్చి ఇక్కడ సరఫరా చేస్తున్నారని, ఈ నిందితుల్లో కొందరి వీసా గడువు ముగిసిందని కమిషనర్ మహేశ్ ఎం భగవత్ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుతున్నట్టు ఆయన పేర్కొన్నారు.

చిత్రం.. సోమవారం హైదరాబాద్‌లో మరో డ్రగ్స్ ముఠాను అరెస్టు చేసిన పోలీసులు