రాష్ట్రీయం

హైదరాబాదుకు ప్రధాని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాదులో నవంబర్‌లో జరుగనున్న ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుకు హాజరయ్యేందుకు నరేంద్రమోదీ అంగీకరించారని చంద్రశేఖరావు వెళ్లడించారు. అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సు తేదీలు ఇంకా ఖరారు కాలేదు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ పర్యటన తేదీలు ఖరారు కాగానే సదస్సు తేదీలు ప్రకటిస్తామన్నారు. ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు తేదీలు ఖరారు కాగానే ప్రధాన మంత్రి పర్యటన కూడా ఖరారు అవుతుందని చంద్రశేఖరరావు వివరించారు. ప్రపంచ పెట్టుదారుల సదస్సును తెలంగాణా ప్రభుత్వం నిర్వహిస్తోందంటూ అమెరికా ఇందులో చురుకైన పాత్ర నిర్వహిస్తోందన్నారు. ఈ సదస్సుకు పలు దేశాలు హాజరవుతున్నాయన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు త్వరలోనే ప్రత్యేక హైకోర్టులను ఏర్పాటవ చేస్తామని ప్రధాని హామీ ఇచ్చినట్లు ఆయన వెళ్లడించారు. ముస్లిం రిజర్వేషన్ల గురించి కూడా ప్రధానితో చర్చించినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం బి.సి జాబితాలో ఉన్న ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించటం గురించి తదుపరి సమావేశంలో లోతుగా చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని నరేంద్ర మోదీ తనతో చెప్పారని చంద్రశేఖరరావు వెళ్లడించారు. రైతుల సమస్యల గురించి కూడా ప్రధానితో చర్చించినట్లు ఆయన చెప్పారు. ఎస్.టిల విషయం కూడా చర్చకు వచ్చిందని చంద్రశేఖరరావు చెప్పారు.