రాష్ట్రీయం

అభివృద్ధికి కాంగ్రెస్ అడ్డంకి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 27: తెలంగాణకు కాంగ్రెస్ ఖల్ నాయక్ అని టిఎస్‌ఐఐసి చైర్మన్ గ్యాదరి బాలమల్లు ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అడుగడుగునా అడ్డు తగులుతున్నారని ఆయన మండిపడ్డారు.
గురువారం ఆయన ఇక్కడ విలేఖర్లతో మాట్లాడుతూ టిఆర్‌ఎస్ పార్టీని, ప్రభుత్వాన్ని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేక కాంగ్రెస్ నేతలు మంత్రి కెటిఆర్‌పై చవకబారు విమర్శలు చేస్తున్నారన్నారు. ప్రచారం కోసం స్ధాయి మర్చిపోయిమంత్రి కెటిఆర్‌పై గాంధీ భవన్ తొట్టి గ్యాంగ్ అవసరంగా నోరుపారేసుకుంటే సహించేదిలేదన్నారు. అవినీతికి కాంగ్రెస్ అభయ హస్తమన్నారు. అధికారం కోల్పోయామన్న దుగ్ధతో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు నిద్రపట్టక టిఆర్‌ఎస్ ప్రభుత్వంపై బట్టకాల్చి మీద వేయడం సిగ్గుచేటన్నారు. నేరెళ్ల ఘటనపై విచారణ పూర్తికా ముందే దళితులపై దాడి పేరిట బురదజల్లడం గర్హనీయమన్నారు. నిందితులెవరైనా చర్యలు తప్పవని ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు.