రాష్ట్రీయం

న్యాయవిద్యలో సర్ట్ఫికేట్ కోర్సులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 29: రానున్న రోజుల్లో న్యాయవిద్యలో సర్ట్ఫికేట్ కోర్సులను ప్రారంభించాలని నల్సార్ -న్యాయ విశ్వవిద్యాయలయాన్ని సిఎం కె చంద్రశేఖరరావు సూచించారు. శనివారం నాడిక్కడ అట్టహాసంగా జరిగిన నల్సార్ 15వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ న్యాయ విద్యా బోధనలో నల్సార్ యూనివర్శిటీ జాతీయస్థాయిలో ఇప్పటికే మంచి పేరు తెచ్చుకుందని, రానున్న రోజుల్లో మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. విలువలతో కూడిన విద్యను అందించడంలో నల్సార్ ముందుందని అభినందించారు. స్టేట్ ఆఫ్ ఆర్టు కోర్సులను ప్రవేశపెట్టడంలో నల్సార్ దేశంలోనే ముందుందన్నారు. న్యాయవిద్యలో కూడా యూనివర్శిటీ సర్ట్ఫికేట్ కోర్సులను ప్రారంభించాలని సూచించారు. రాష్ట్రంలో కూడా న్యాయ విద్యా కోర్సులు, కార్యక్రమాలు విస్తరించాలని అందుకు నల్సార్ చొరవ తీసుకోవాలని సూచించారు. ఉన్నత విద్యకు రాష్ట్రంలో మరిన్ని ఎక్స్‌లెన్సీ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని సిఎం తెలిపారు. అదనపు భవనాల నిర్మాణానికి నల్సార్‌కు 22 ఎకరాల భూమి కేటాయించనున్నట్టు సిఎం ప్రకటించారు. నల్సార్ క్యాంపస్ ఆధునికీకరణకు ప్రభుత్వ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. బంగారు తెలంగాణ ఏర్పాటులో నల్సార్ పాలుపంచుకోవాలని సిఎం ఆకాంక్షించారు. స్నాతకోత్సవం సందర్భంగా 49 మంది విద్యార్థులకు బంగారు పతకాలు, 406 మంది విద్యార్థులకు న్యాయ శాస్త్ర పట్టాలు అందజేశారు. చదువులు పూర్తి చేసుకుని పట్టాలు, బంగారు పతకాలు పొందిన విద్యార్థులకు సిఎం అభినందనలు , శుభాకాంక్షలు చెప్పారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జెఎస్ ఖేహర్, యూనివర్శిటీ ఛాన్సలర్, ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథ్, వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఫైజాన్ ముస్త్ఫా, వర్శిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డితో పాటు విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

చిత్రం.. ప్రతిభా విద్యార్థులకు బంగారు పతకాలు అందిస్తున్న సిఎం కెసిఆర్, సుప్రీం సిజె ఖేహర్