రాష్ట్రీయం

హైదరాబాద్‌లో స్వైన్‌ఫ్లూతో ఒకరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 29: తెలంగాణ రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ విస్తృతమవుతోంది. గాంధీ దవాఖానాలో భవాని అనే ఏడునెలల గర్భిణి (23) శనివారం స్వైన్‌ఫ్లూవల్ల మరణించింది. గాంధీ దవాఖానాలో స్వైన్‌ఫ్లూ చికిత్సకు ప్రభుత్వం ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసింది. స్వైన్‌ఫ్లూ సోకిన వారిని ఈ వార్డులో చేర్చి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. 2016 ఆగస్టు 1 నుండి ఇప్పటి వరకు స్వైన్‌ఫ్లూ లక్షణాలు కలిగిన 11,923 మందిని పరీక్షించగా, వీరిలో 1572 మందికి స్వైన్‌ఫ్లూ ఉన్నట్టు తేలింది. వీరందరికీ చికిత్స అందించారు. గత ఏడాది కాలంలో స్వైన్‌ఫ్లూతో పాటు ఇతరత్రా ఆరోగ్య సమస్యలున్న 22 మంది చికిత్స పొందుతూ మరణించారు.