ఆంధ్రప్రదేశ్‌

డ్రగ్స్ వినియోగంపై ఉక్కుపాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 29: మత్తు పదార్థాల (డ్రగ్స్) విషయంలో తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహారిస్తుందని, ఎవరినీ ఉపేక్షించదని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో ‘్ఫక్కి’ నిర్వహించిన సదస్సులో మంత్రి నారా లోకేష్‌తో పాటు ఆయన సతీమణి నారా బ్రహ్మణి కూడా పాల్గొన్నారు. అనంతరం మంత్రి నారా లోకేష్ తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ డ్రగ్స్ విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, దురలవాట్లకు దూరంగా ఉండేలా చూడాలని అన్నారు. మత్తు పదార్థాల వినియోగం విషయంలో తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహారిస్తుందని ఆయన తెలిపారు. ఎపిలో గంజాయి వాడకం ఉందన్న విషయం ప్రచారంలో ఉందని, అయితే ఈ విషయంలో కఠినంగా వ్యవహారిస్తామని ఆయన చెప్పారు. డ్రగ్స్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం సినీ పరిశ్రమనే టార్గెట్ చేసిందన్న వాదనను ఆయన తోసిపుచ్చారు. తనకు అలా ఏమీ అనిపించడం లేదని ఆయన తెలిపారు.
అనుమానం ఉన్న వారిని, ఆరోపణలు ఉన్న వారిని విచారించడంలో తప్పు లేదన్నారు. అలా అనుమానం, ఆరోపణలు ఉన్న వారినే విచారిస్తున్నారని, ఇటువంటి విషయంలో కఠినంగా వ్యవహారించాల్సిందేనని ఆయన చెప్పారు. తెలుగు సినీ పరిశ్రమ ఆంధ్ర ప్రదేశ్ వైపు చూస్తోందని ఆయన తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చాలా వేగంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేపడుతున్నదని అన్నారు. పైగా కొత్తగా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తున్నదని, పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే వారికి ప్రోత్సాహాకాలు ఇస్తున్నదని ఆయన తెలిపారు.

చిత్రం.. శనివారం హైదరాబాద్‌లో ‘్ఫక్కి’ నిర్వహించిన సదస్సులో
నారా లోకేష్‌తోపాటు ఆయన సతీమణి నారా బ్రహ్మణి