రాష్ట్రీయం

యువ భారత్ ముందు సవాళ్లెన్నో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖమపట్నం, జూలై 29: యువతరంతో ఉప్పొంగుతున్న యువ భారత్‌ను ప్రపంచంలోనే అగ్రామిగా నిలిపే క్రమంలో ఎదురయ్యే సవాళ్లను సమర్ధవంతంగా ఎదుర్కొనాలని నలంద విశ్వ విద్యాలయం కులపతి ఆచార్య విజయ్ పాండురంగ భట్కర్ అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం 83,84 స్నాతకోత్సవ కార్యక్రమంలో గౌరవ డాక్టరేట్ అందుకున్న సందర్భంగా ఎయు కాన్వొకేషన్ హాల్‌లో శనివారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అధిక జనాభా దేశానికి భారంగా మారుతోందన్న వాదన పక్కన పెడితే 135 కోట్ల మందిలో 25 సంవత్సరాల లోపు వయస్సు కలిగినవాళ్లే 50 శాతం ఉండగా, 35 సంవత్సరాల వయస్సున్న వారి సంఖ్య 65 శాతంగా ఉందన్నారు. రానున్న 2020 నాటికి మన దేశ సగటు వయసు కేవలం 29 సంవత్సరాలు మాత్రమేనన్నారు. ఇదే సమయంలో చైనా ప్రజానీకం సగటు వయసు 37 కాగా, జపాన్ ప్రజల సగటు వయసు 48గా నమోదు కానుందన్నారు. 21వ శతాబ్దంలో యువతరం నిండిన దేశంగా భారత్ అవతరిస్తుందన్నారు. యువతకు అవసరమైన నాణ్యతతో కూడిన విద్య, నైపుణ్యత అన్ని స్థాయిల్లోను అందించడమే దేశం ముందున్న అతిపెద్ద సవాలుగా ఆయన అభిప్రాయపడ్డారు. స్వాతంత్య్రానంతరం సుదీర్ఘ ప్రస్తానాన్ని ప్రారంభించిన భారత్ గత ఏడు దశాబ్దాల కాలంలో ఆధునిక విద్యా వ్యవస్థను నిర్మించుకున్నామన్నారు. చైనా, అమెరికాల తరువాత అతిపెద్ద విద్యా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నామని, దేశవ్యాప్తంగా 900 విశ్వవిద్యాలయాలు, 40 వేల కళాశాలలు, 13 లక్షల పాఠశాలలు, 10వేల ప్రొఫెషనల్ కళాశాలలు ఏర్పాటు చేసుకున్నామన్నారు.
ప్రతి సంవత్సరం 15 లక్షల మంది ఇంజనీరింగ్ పట్ట్భద్రులు కళాశాలల నుంచి బయటకు వస్తున్నారన్నారు. గ్రామీణ ప్రాంతాలతో ముడిపడి ఉన్న భారత్‌లో రైతుల గురించి ఆలోచించాల్సి ఉందన్నారు. సాంకేతిక, ఇతర విశ్వవిద్యాలయాలను గ్రామాలతో అనుసంధానించడం ద్వారా మంచి ఫలితాలు సాధించగలుగుతామన్నారు. గ్రామాభ్యుదయంతోనే సమ్మిళిత ప్రగతి సాధ్యపడుతుందని తన ప్రగాఢ విశ్వాసమని భట్కర్ పేర్కొన్నారు.

చిత్రం.. ఎయు గౌరవ డాక్టరేట్ అందుకుంటున్న నలంద విశ్వవిద్యాలయం ఛాన్స్‌లర్ భట్కర్