రాష్ట్రీయం

యాప్‌లతో అక్రమార్కులకు చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జూలై 29: ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు టెక్నాలజీ అంటే ఎంత ఇష్టపడతారో రాష్ట్రప్రజలందరికీ తెలిసిందే. ఇక ఆ టెక్నాలజీని వాడి ప్రభుత్వ ధనం పొదుపు చేస్తానంటే అంతకుమించిన ఇష్టం. ఈ ఒరవడి అందిపుచ్చుకున్నారో ఏమోగాని పశ్చిమగోదావరి జిల్లాలో కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్ లబ్ధిదారుల అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు సరికొత్త యాప్‌ను తెరపైకి తీసుకువచ్చారు. ఈవిధానం ముందుకెళితే ఇక రుణాలు తీసుకుని గాలిలో కలిసిపోయే లబ్ధిదారులకు ఇక అవకాశం ఉండ దు. అలాగే మొత్తం సంక్షేమ విభాగాల పరిధిలో బినామీ పేర్లపై రుణాలు పొంది ఆతర్వాత ప్రభుత్వాలు మారితే మాఫీ లబ్ధి అందుతుందని ఎదురుచూసే వారికి కూడా ఇది చేదువార్తే. ఒకరకంగా చూస్తే సంక్షేమ విభాగాల పరిధిలో పలు కార్పొరేషన్లు ఉన్నప్పటికీ వాటి పరిధిలో బడ్జెట్‌లు ఘనంగా ఉన్నప్పుడు విరివిరిగా రుణాలు ఇవ్వటం, ఆ తరువాత రికవరీ లేక గగ్గోలు పెట్టడం సర్వసాధారణంగా మారిపోయింది. కొన్ని కార్పొరేషన్ల పరిస్థితి అయితే ఇప్పుడు ఉంటాయా, ఊడతాయా అన్న ఊగిసలాటలో చిక్కుకుపోయాయి. ఇక తాజాగా కాపు కార్పొరేషన్‌ను చూసుకుంటే దీనిలోనూ మిగిలిన సంక్షేమ విభాగాల్లో చోటుచేసుకున్న జాఢ్యాలే పూర్తిస్థాయిలో అవరించి ఉన్నట్లు కన్పిస్తోంది. ఈ విషయంపైనే రాష్టస్థ్రాయిలోనే పెద్దచర్చ మొదలైన విషయం తెల్సిందే. ఈ వ్యవహారాలు అలాఉంచితే జిల్లాస్ధాయిలో కూడా ఇంతకన్నా దారుణమైన పరిస్థితులు కనిపించడంతో కలెక్టరు ఈ వ్యవహారాలపై ఉక్కుపాదం మోపాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు మాదిరిగానే టెక్నాలజీని రంగంలోకి దింపితే తప్ప కుదరదన్న నమ్మకంతో సంక్షేమ విభాగాల కోసం ఒక ప్రత్యేకమైన యాప్‌ను రూపొందించారు. నిక్‌నెట్ సారధ్యంలో ఈ యాప్ రూపొందించగా దానికి సంబంధించి ప్రస్తుతం జిల్లావ్యాప్తంగానే సంక్షేమ విభాగాల పరిధిలో రుణాల పొందిన లబ్ధిదారుల కోసం జల్లెడ పట్టేస్తున్నారంటే ఆతిశయోక్తి కాదు. బిసి కార్పొరేషన్ పరిధిలో కుమార్ అనే లబ్ధిదారుడు రుణం పొంది ఉంటే ఆ గ్రామం వెళ్లి అక్కడ కుమార్ ఏర్పాటుచేసిన యూనిట్‌ను పరిశీలిస్తారు. యూనిట్ ఉంటే సంబంధిత లబ్ధిదారునితో ఫొటో తీసి మరీ యాప్‌లో పొందుపరుస్తారు. లేకుంటే లేదని కూడా అదే యాప్‌లో చేరుస్తారు. ఎస్సీ, బిసి, ఎస్టీ, కాపు, మైనార్టీ కార్పొరేషన్ల పరిధిలో రుణాలు, లబ్ధిదారులు, యూనిట్ల లక్ష్యంగా జిల్లా అంతటా ఇప్పుడు సర్వే బృందాలు వేటాడేస్తున్నాయి. ప్రాధమికంగానే కళ్లు బైర్లు గమ్మే రీతిలో వాస్తవాలు వెలుగుచూస్తుండటంతో ఇక ఇంతకుముందు వ్యవహారాలను కూడా చూసుకుంటే ఎంతమేరకు ప్రభుత్వ ధనానికి గండి పడిందన్నది తేలుతుంది. ఒకరకంగా చూస్తే దాదాపు అన్ని సంక్షేమ కార్పొరేషన్లు, విభాగాల పరిధిలో ఈవిధంగా ఆచూకీ లేని లబ్ధిదారుల సంఖ్య తొలిదశలోనే గణనీయంగా కనపడటం గమనార్హం.
ఈ నేపధ్యంలో ఇకనుంచి ఇచ్చే సంక్షేమ యూనిట్లు, రుణాలు, ఇతర అంశాలకు సంబంధించి లబ్ధిదారుల విషయంలో ఖచ్చితమైన మార్గదర్శకాలను జిల్లా యంత్రాంగం విడుదల చేసింది. దీనిలోభాగంగా అయా విభాగాల పరిధిలో ప్రాధమికంగా జరిగే లబ్ధిదారుల ఎంపిక సమయంలోనే వారి బయోమెట్రిక్‌ను సేకరిస్తారు. అవిధంగా బినామీలకు చెక్ పెట్టాలని భావిస్తున్నారు.