రాష్ట్రీయం

ఉప రాష్టప్రతి పదవికి వనె్నతెస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 29: రాజ్యాంగబద్ధమైన ఉప రాష్టప్రతి పదవి వల్ల క్రియాశీలక రాజకీయాలకు, సొంత అభిరుచులు, సన్నిహిత ప్రజలకు కాస్తంత దూరమైనప్పటికీ, పదవీ బాధ్యతలు క్షుణ్ణంగా అర్థం చేసుకుని రాష్ట్ర ప్రయోజనాల కోసం అర్థవంతంగా ఆ పదవిని వినియోగిస్తానంటూ ఎన్‌డిఏ ఉప రాష్టప్రతి అభ్యర్థి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. శనివారం విజయవాడలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో మిత్రులు ఏర్పాటుచేసిన ఆత్మీయ సత్కార సభలో వెంకయ్యనాయుడు దాదాపు గంటసేపు చమత్కారాలతో తన మనసులో మాటలన్నింటినీ బైటపెట్టారు. రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన నష్టాన్ని పూడ్చే దిశలో గడచిన మూడేళ్ల కాలంలో తాను చేయాల్సినదంతా చేశానని ఇక సద్వినియోగం చేసుకోవాల్సింది పాలకులేనని అన్నారు. 2019 ఎన్నికల్లో నరేంద్ర మోదీ తిరిగి రెండోసారి ప్రధానమంత్రి కావాలని, కనీసం పదేళ్లపాటు ఆయన ప్రధానిగా ఉంటేనే భారతదేశంలో పూర్తిగా ఆర్థిక అసమానతలు తొలగిపోతాయన్నారు. నల్లధనం పూర్తిగా బైటపడాలని తాను భావిస్తూ ఊరూ వాడా ప్రచారం చేస్తుంటే తాను ఎవరికో అడ్డుపడతాననే భయంతోనే కొందరు కుట్రతో రాజ్యాంగబద్ధ పదవి కట్టబెట్టారనే తప్పుడు ప్రచారం సాగిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో తనపై కుట్ర పనే్న స్థాయి ఎవరికీ లేదు.. అలాగే పార్టీలో అది సాధ్యపడేది కాదని కూడా కరాఖండిగా చెప్పారు.
రాష్ట్రం విడిపోయినా తెలుగువారంతా కలసి ఉండాలని తాను ఎప్పుడూ కోరుకుంటానని అన్నారు. ఉప రాష్టప్రతి పదవి టు ఇన్ వన్ వంటిదన్నారు. రాజ్యసభ చైర్మన్‌గా రాజకీయాల కతీతంగా పార్లమెంటు సంప్రదాయాలను కాపాడాల్సి ఉందన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ మంత్రిని అయినా పిలిపించుకుని మాట్లాడే అవకాశం ఉంటుందన్నారు.