రాష్ట్రీయం

రెండో జాబితా సిద్ధం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 30: మాదకద్రవ్యాల కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఎక్సైజ్ సిట్ నేతృత్వంలో కొనసాగుతోన్న దర్యాప్తులో ఇంకా కొందరు సినీ ప్రముఖుల పేర్లు బయటకు రావడంతో రెండో జాబితాను సిట్ సిద్ధం చేసినట్టు తెలిసింది. దీంతో టాలీవుడ్‌లో ప్రకంపనలు రేగుతున్నాయి. సినీ ప్రముఖుల దర్యాప్తు చివరి దశకు చేరడంతో సిట్ అధికారులు రెండో జాబితాపైనే దృష్టి సారించారు. నేడో, రేపో రెండో జాబితాలోవున్న వారందరికీ నోటీసులు జారీ చేయనున్నట్టు సమాచారం. డ్రగ్స్ వ్యవహారంలో నోటీసులు అందుకున్న 12మంది సినీ పరిశ్రమకు చెందిన వారిని సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఈనెల 19న మొదలైన సినీ ప్రముఖుల విచారణ ఆగస్టు రెండో తేదీతో ముగియనుంది. ఇప్పటి వరకు తొమ్మిది మంది సినీ ప్రముఖులను సిట్ విచారించిన విషయం తెలిసిందే. కాగా సినీ ప్రముఖుల విచారణలో కీలక సమాచారం రాబట్టిన సిట్ అధికారులు, సినీ పరిశ్రమలో మరికొంత మందికి డ్రగ్స్ వ్యవహారంతో సంబంధాలున్నట్టు వచ్చిన అభియోగాలపై సిట్ ఆరా తీసినట్టు తెలుస్తోంది. ఈ మేరకు వీరికి రెండో జాబితా సిద్ధం చేసి, నోటీసులు అందజేయనున్నట్టు సమాచారం. సినీ ప్రముఖులకు ఇకపై అందే నోటీసులు గోప్యంగా ఉంటాయని తెలుస్తోంది. కాగా, ఈ కేసులో మలివిడత నోటీసులపై కలకలం చెలరేగుతోంది. సిట్ అధికారులే స్వయంగా ప్రకటించిన దరిమిలా రెండో జాబితాపై జోరుగా చర్చ జరుగుతోంది. టాలీవుడ్‌ను డిఫెన్స్‌లో పడేసిన డ్రగ్స్ కేసు ఇప్పట్లో నిలిచిపోయే పరిస్థితులు కనిపించడలేదు. కాగా ఈ కేసులో దర్యాప్తును వేగిరం చేసిన సిట్ అధికారులు ఎప్పుడు, ఎవరిని పిలుస్తారోనని సినీ ప్రముఖుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. కాగా, డ్రగ్స్ కేసు దర్యాప్తులో భాగంగా సోమవారం నటుడు తనీష్‌ను విచారించనున్నట్టు సిట్ అధికారులు తెలిపారు.