రాష్ట్రీయం

అసాంఘిక శక్తుల ఆటకట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, జూలై 30: సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో ఆధునిక టెక్నాలజీని వినియోగించుకొని ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని రాష్ట్ర భారీ నీటిపారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. శాంతిభద్రత పర్యవేక్షణలో తనదైన ముద్ర వేసి సిద్దిపేటను ప్రశాంతంగా తీర్చిదిద్దాలని సూచించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కమిషనరేట్ కార్యాలయంలో 1.50 కోట్లతో ఏర్పాటు చేసిన అత్యాధునికమైన కమాండ్ కంట్రోల్ రూం, లేక్ పోలీసింగ్ సెంటర్, రాపిడ్ కాప్ యూనిట్‌ను డిఐజి శివశంకర్‌రెడ్డి, సిపి శివకుమార్‌తో కలసి ప్రారంభించారు. ఆనంతరం ఆయన మాట్లాడుతూ సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో 858 సిసి కెమెరాలను ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ కొనసాగించటం వల్ల దొంగతనాలు చాలావరకు అరికట్టినట్లు తెలిపారు. భవిష్యత్తులో ప్రతి మండల కేంద్రాల్లో, పట్టణాల్లో, ముఖ్య గ్రామాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ రూంకు అనుసంధానం చేయనున్నట్లు పేర్కొన్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్, పట్టణంలోని సిసి కెమెరాలను దీనికి అనుసంధానం చేయటం వల్ల నిరంతర పర్యవేక్షణ ఉంటుందన్నారు. పోలీసు వాహనాలకు సైతం జిపిఎస్ సౌకర్యం కల్పించటం వల్ల ఏదైనా ప్రమాదం, అనుకోని విపత్తులు జరిగినా సమీపంలోని వాహనాలను అప్రమత్తం చేసేందుకు వీలు ఉంటుందన్నారు. 108 ఎమర్జెన్సీ అంబులెన్స్‌లు, హైవే పెట్రోలింగ్ వాహనాలను అనుసంధానం చేసి పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ తర్వాత సిద్దిపేటలోనే అత్యాధునికమైన టెక్నాలజీని వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. పోలీసులు సైతం ప్రజలతో స్నేహ పూర్వకంగా మెలగి ప్రజలకు మెరుగైన సేవలు అందించి మంచి సమాజం నిర్మాణం కోసం పాటుపడాలన్నారు.
తెలంగాణ సర్కార్ శాంతి భద్రతల పర్యవేక్షణలో భాగంగా పోలీసు శాఖకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తోందని హరీశ్‌రావు అన్నారు. పోలీసులకు అత్యాధునికమై వాహనాలను సమకూర్చినట్లు పేర్కొన్నారు. పోలీసుల పనిభారం తగ్గించేందుకు కొత్తగా 26వేల పోలీసు పోస్టులను భర్తీ చేసేందుకు సర్కార్ చర్యలు తీసుకుంటుందన్నారు. ఇప్పటికే 9వేల మంది పోలీసులు ఎంపికై శిక్షణ పొందుతున్నారని, త్వరలో 10 వేలకు పైగా పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు పేర్కొన్నారు. పోలీసు సంక్షేమం కోసం ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. అంతకు ముందు పోలీసులకు జాకెట్లు, బ్రీత్ ఆనరైజర్స్‌ను మంత్రి హరీష్‌రావు అందచేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, కమిషనర్ రమణాచారి, పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.

చిత్రం.. పోలీస్ కమాండ్ కంట్రోల్ రూంను ప్రారంభిస్తున్న మంత్రి హరీశ్‌రావు