రాష్ట్రీయం

బాణసంచా గోడౌన్‌లో అగ్నిప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేణిగుంట, జూలై 30: తిరుపతి రూరల్ తిమ్మినాయుడు పాల్యెం పంచాయతీ పరిధిలోని రేణిగుంట మార్గంలోఉన్న ఓ బాణాసంచా గోడౌన్‌లో ఆదివారం సాయంత్రం 7.15 గంటల సమయంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు బాలకార్మికులు మృతిచెందడంతో పాటు మరో మహిళ తీవ్రంగా గాయపడి మృత్యువుతో పోరాడుతోంది. బాణాసంచా తయారీ సందర్భంగా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఈప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. సంఘటన జరిగిన వెంటనే గోడౌన్ యజమానులు పరార్ కావడంతో పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. కాగా ఈ సంఘటనతో జరిగిన పేలుడు శబ్దాలు 15 కిలోమీటర్ల మేర భూకంపాన్ని తలపించాయి. ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురై తలో దిక్కు పరుగులు తీశారు. కాగా ఈ ప్రమాదంలో గోడౌన్‌లో పనిచేస్తున్న ఇద్దరు బాలకార్మికులు మృతి చెందారు. వీరిలో మణి(10) , మంజు (13) బాల కార్మికులు మృతి చెందాడు. తీవ్రగాయాలకు గురైన ధనలక్ష్మి అనే మహిళ రుయాలో మృత్యువుతో పోరాడుతోంది. పేలుడు ప్రభావంతో 50 అంకణాల విస్తీర్ణలో ఉన్న గోడౌన్ కూలిపోయింది. ఈక్రమంలో శిధిలాల కింద మరి కొన్ని శవాలు ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు.