ఆంధ్రప్రదేశ్‌

మీరు సమీక్షించి.. నాకు చెప్పండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 31: పోలవరం ప్రాజెక్టు పనులపై ఇకనుంచి అధికారుల సమీక్షలు నిర్వహించి, పురోగతిని ప్రతి వారం తనకు వివరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సమీక్షలు మీరు నిర్వహిస్తే అవసరమయ్యే పరిష్కారాలను తాను సూచిస్తూ మార్గదర్శకత్వం చేస్తానని అన్నారు. ఫలితాలు సాధించేలా సమీక్షలు జరగాలనేది తన ఉద్దేశమని చెప్పారు. సమీక్ష సారాంశాన్ని వివరించడం ద్వారా తాను వేగంగా నిర్ణయాలు తీసుకోవడానికి, సమయాన్ని ఆదా చేయడానికి దోహదపడుతుందని అన్నారు. పోలవరంసహా 28 ప్రాధాన్య ప్రాజెక్టుల నిర్మాణానికి తలెత్తే ఇబ్బందులను తొలగించి పనులు వేగంగా, సాఫీగా సాగేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు. పోలవరం, ప్రాధాన్య ప్రాజెక్టుల పురోగతిపై ముఖ్యమంత్రి సోమవారం సచివాలయంలోని తన కార్యాలయంలో సమీక్షించారు. పోలవరం పనులు సాగుతున్న తీరును వర్చువల్ ఇన్‌స్పెక్షన్ ద్వారా పరిశీలించారు. పోలవరం పనుల పురోగతిపై ముఖ్యమంత్రి వర్చువల్ ఇన్‌స్పెక్షన్ చేయడం ఇది 35వ సారి. గడిచిన వారం స్పిల్ చానల్, లెప్ట్ ప్లాంక్‌కు సంబంధించి 3.15 లక్షల క్యూబిక్ మీటర్ల మేర మట్టి తవ్వకం పనులు జరిగినట్టు అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. 21,007 క్యూబిక్ మీటర్ల వరకు స్పిల్‌వే, స్టిల్లింగ్ బేసిన్ కాంక్రీట్ పనులు, 2.20 మీటర్ల వరకు డయాఫ్రమ్ వాల్ నిర్మాణంతో పాటు మూడు రేడియల్ గేట్ల ఫ్యాబ్రికేషన్ పనులు పూర్తయ్యాయి.
పోలవరం నిర్మాణంకోసం 1,055 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకం పనులు చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 739 లక్షల క్యూబిక్ మీటర్ల తవ్వకం పూర్తయింది. ఇంకా 316 లక్షల క్యూబిక్ మీటర్ల వరకు పనులు పూర్తి కావాల్సి ఉంది. స్పిల్‌వే, స్టిల్లింగ్ బేసిన్ రెండింటికి కలిపి మొత్తం 16.04 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులకు గాను ఇప్పటివరకు 1.83 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు పూర్తయ్యాయి. 685 మీటర్ల మేర నిర్మించాల్సి ఉన్న డయాఫ్రమ్ వాల్ పనులు వేగంగా సాగుతున్నాయి. ఆదివారం నాటికి 555 మీటర్ల పనులు పూర్తికాగా, ఇంకా 130 మీటర్ల వరకు నిర్మాణం చేపట్టాల్సి ఉంది.
జూలై 21 నుంచి 31 వరకు రాష్ట్రంలో 15 మి.మీ. వర్షపాతం నమోదైందని షార్ అధికారులు వివరించారు. రుతుపవనాలు బలహీనపడి వారం రోజులుగా వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ ఆగస్టు రెండో వారంలో రాష్టమ్రంతటా మళ్లీ వానలు కురుస్తాయని చెప్పారు. అటు ఆల్‌మట్టి ప్రాజెక్టుకు నిరంతరాయంగా ఇన్‌ఫ్లో ఉండటంతో 99 శాతం నిండిందని, నారాయణపూర్ ప్రాజెక్టు 97 శాతం నిండిందని, ఈ వారంలో రాష్ట్రంలోని ప్రాజెక్టులకు నీరు చేరుతుందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. అనంతపురంలోని 17 వర్షాభావ మండలాల్లో నీటి నిర్వహణకు తీసుకున్న చర్యలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. కర్నూలుకు తాగునీటి సరఫరా అంశంపైనా చర్చించారు. తుంగభద్ర, సుంకేశుల నుంచి తక్షణం నీటి సరఫరా చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.

చిత్రం.. పోలవరం ప్రాజెక్టు పురోగతిపై సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు