రాష్ట్రీయం

కంటతడి పెట్టిన మీరాకుమార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, జూలై 31: నేరెళ్ళలో ఇసుక మాఫియా ఆగడాలకు బలైన బాధితులకు అన్నివిధాలా అండగా ఉంటామని మీరాకుమార్ భరోసా ఇచ్చారు. ఈ ఘటనపై చలించిపోయన ఆమె బాధిత దళిత కుటుంబాలను పరామర్శించారు. వారిని ఆలింగనం చేసుకుని కంటతడి పెట్టారు. లారీ ప్రమాదంలో మృతి చెందిన బదనపురం భూమయ్య కుటుంబానికి రూ.50 వేల రూపాయల చెక్కును అందజేశారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై ఆమె బాధిత కుటుంబాలతో మాట్లాడుతూ, దళిత, బలహీన వర్గాల రక్షణ కోసం తగిన చర్యలు తీసుకుంటామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అన్ని వర్గాలకు ప్రయోజనం కలుగుతుందని ఆశిస్తే, కేవలం ఒకే వర్గానికి ప్రయోజనం జరుగుతోందని, ప్రజల ఆశలను పాలకులు తుంగలో తొక్కారన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం నేరెళ్ళ బాధితులను సోమవారం మధ్యాహ్నం ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా మీరాకుమార్ మాట్లాడుతూ, దళితులు, బలహీనవర్గాలపై దాడులు జరగడం అమానుషమని, ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని స్పష్టం చేశారు. కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్న కెసిఆర్ సర్కారు తీరుపట్ల ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. భూమయ్య మృతికి కారణమైన లారీ డ్రైవర్‌పై కానీ, కాంట్రాక్టర్‌పై కానీ ఎలాంటి కేసు నమోదు చేయని పోలీసులు, కేవలం ప్రభుత్వ, కాంట్రాక్టర్ల ప్రయోజనం కోసమే దళిత కుటుంబాలపై కేసులు నమోదు చేసి అకారణంగా నిర్బంధించి, దాడి చేసి జీవచ్ఛవాలుగా మార్చారని నిరసించారు. లారీ డ్రైవర్ ప్రాణం తీసి పారిపోతే అమాయక దళిత కుటుంబాలను చితక బాదడం పోలీసులకు పాలకులు వత్తాసు పలుకుతున్నారనడానికి నిదర్శనమన్నారు. ఈ సందర్భంగా మీరాకుమార్ హిందీలో ప్రసంగించగా, టిపిసిసి చీఫ్ ఉత్తమ్‌కుమార్ తెలుగులో అనువదించారు. అనంతరం ఎఐసిసి కార్యదర్శి వి.హన్మంతరావు మాట్లాడుతూ, దొంగల కోసం పరిపాలన సాగిస్తున్నారని, కేవలం ఇసుక దొంగలు, స్మగ్లర్ల కోసమే పాలకులు పనిచేస్తున్నారని అన్నారు.

చిత్రం.. నేరెళ్ళ బాధితులను పరామర్శిస్తున్న మీరాకుమార్