రాష్ట్రీయం

కృష్ణా బోర్డుతో నేడు బజాజ్ కమిటీ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 1: కృష్ణా జలాలను ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు పంపిణీ విధానాన్ని అమలు చేసే ఫార్ములా, నీటి వినియోగం ప్రోటోకాల్‌ను ఖరారు చేసేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన బజాజ్ కమిటీ బుధవారం ఢిల్లీలో కృష్ణా జలాల బోర్డుతో సమావేశమవుతోంది. గోదావరి నదిపై పట్టిసీమ ఎత్తిపోతల స్కీం ద్వారా ఆంధ్రప్రదేశ్ నీటిని కృష్ణా డెల్టాకు మళ్లిస్తున్నందు వల్ల తమకు ఎగువున ఉన్న రాష్ట్రంగా కృష్ణా జలాల్లో వాటా పెరుగుతుందని, ఈ అంశాన్ని తేల్చాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్ర జలవనరుల శాఖకు లేఖ రాసిన సంగతి విదితమే. ఈ ఏడాది కృష్ణా జలాల పంపిణీని ఆంధ్రాకు 512 టిఎంసి, తెలంగాణకు 299 టిఎంసిని కేటాయించడాన్ని అంగీకరించేది లేదని కూడా తెలంగాణ స్పష్టం చేసింది. ఈ విషయమై కేంద్ర జలవనరుల శాఖకు ఎపెక్స్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ కోరింది. ఈ నేపథ్యంలో బజాజ్ కమిటీ కృష్ణా బోర్డుతో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
తెలంగాణలో కృష్ణా బేసిన్ ఎక్కువగా ఉన్నా కేవలం 299 టిఎంసి నీటిని కేటాయించడం తగదని, ఈ ఏడాది ఈ వాటాకు అంగీకరించమని తెలంగాణ స్పష్టం చేసింది. పైగా 1978లో జరిగిన పోలవరం ప్రాజెక్టు ఒప్పందం ప్రకారం ఈ నీటిని వినియోగించుకునే రాష్ట్రం కృష్ణా జలాల్లో 45 టిఎంసి నీటిని ఎగువ రాష్ట్రాలకు వదిలేయాలి. ప్రస్తుతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత ఆంధ్రాకు ఎగువ రాష్ట్రం తెలంగాణ అవుతుంది. కాగా వాటాల సంగతి ఎలా ఉన్నా, 90 టిఎంసి వరకు కృష్ణా జలాలను తమకు వినియోగించుకునేందుకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ కేంద్రాన్ని కోరుతూ గత ఏడాది జూలై 23వ తేదీన కోరింది. ఎపెక్స్ కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని గత ఏడాది తెలంగాణ కోరినా, ఇంతవరకు సమావేశపరచలేదు.
గోదావరి జలాల మళ్లింపుపై తెలంగాణ అభ్యంతరంపై గోదావరి బోర్డు ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ అంశంపై కూడా తెలంగాణ కేంద్ర జలవనరుల శాఖకు అసమ్మతి తెలిపింది. కృష్ణా రిజర్వాయర్లు జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్‌ను పరిగణనలోకి తీసుకుని సాధారణ నీటి మట్టం, ఎక్కువ జలాలు ప్రవహిస్తే, లేదా లోటు ఉన్న సమయాల్లో నీటి వినియోగంపై ఇంతవరకు నీటి కేటాయింపుల ప్రోటోకాల్ రెండు రాష్ట్రాలకు ఖరారు కాలేదు. ఈ ఏడాది ఆగస్టు వచ్చినా శ్రీశైలం, నాగార్జునసాగర్ కలిపి 530 టిఎంసికి కేవలం 130 టిఎంసి నీరు మాత్రమే లభ్యత ఉంది. నాగార్జునసాగర్‌లో నీటి మట్టం కనీసం 510 టిఎంసి ఉంటేనే హైదరాబాద్‌కు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు కనీసం మంచినీరు అందుతుంది. ప్రస్తుతం 501 టిఎంసి నీటి మట్టం ఉంది. శ్రీశైలంలో నీటి మట్టం 19 టిఎంసి నీరు ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత ఏడాది పట్టిసీమ నుంచి 53 టిఎంసి నీటిని కృష్ణా డెల్టాకు మళ్లించింది. దీని వల్ల కృష్ణా డెల్టాకు మంచినీటి, సాగునీటి కొరత తలెత్తలేదు. కాగా ఈ నెల రెండో వారంలో కృష్ణా బోర్డు సమావేశం హైదరాబాద్‌లో జరిగే అవకాశం ఉంది.