రాష్ట్రీయం

భద్రాద్రి అత్యద్భుతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు1: భద్రాద్రి ఆలయ మాస్టర్ ప్లాన్ అత్యద్భుతంగా ఉందని త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జీయర్ కితాబిచ్చారు. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయాన్ని ‘టెంపుల్ సిటీ’గా మార్చేందుకు రూపొందించిన ‘నమూనా’ను రోడ్లుభవనాల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చిన్నజీయర్‌కు చూపించారు. హైదరాబాద్ సమీపంలోని శ్రీరాంనగర్‌లో జీయర్‌ను తుమ్మల కలిశారు. సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు ఆర్కిటెక్ట్ ఆనందసాయి రూపొందించిన నమూనాను చిన్నజీయర్ పరిశీలించారు.
ఆనందసాయి కొన్ని నమూనాలను రూపొందించిన తర్వాత చిన జీయర్‌తోపాటు భద్రాచలం ఆలయ పూజారులు, వేద పండితులు పరిశీలించి గతంలోనే కొన్ని సూచనలు చేశారు. వారి సూచనలను పరిగణనలోకి తీసుకుని తుది నమూనాను ఆనంద్‌సాయి రూపొందించారు. నమూనా అత్యద్భుతంగా ఉందని, దీని ప్రకారం భద్రాచలం టెంపుల్ సిటీ నిర్మిస్తే అంతర్జాతీయంగానూ పేరు లభిస్తుందన్నారు. ఆనంద్‌సాయి రూపొందించిన మాస్టర్‌ప్లాన్‌పై చిన జీయర్ తన సందేశాన్ని రాసి సంతకం చేశారు. మాస్టర్ ప్లాన్‌లో పేర్కొన్న మూడు ప్రాంగణాల్లో మొదటి ప్రాంగణాన్ని రాతితో నిర్మించాలని, మిగిలిన ప్రాంగణాలను ఇటుకలతో నిర్మించవచ్చని జీయర్ పేర్కొన్నారు.
చిన జీయర్ సూచనలు తీసుకున్న అనంతరం మంత్రి తుమ్మల మాట్లాడుతూ తుది నమూనాకు అనుగుణంగా టెంపుల్ సిటీ నిర్మాణం అవుతుందన్నారు. ఆలయంచుట్టూ నిర్మించే మాడ వీధులకోసం కొందరి ఇళ్లు కూల్చాల్సి ఉంటుందని, ఇళ్లు కోల్పోయినవారికి మెరుగైన ప్యాకేజీ ఇస్తామని ప్రకటించారు. మాస్టర్‌ప్లాన్, నిర్మాణ పనులకు సిఎం ఆమోదం లభించగానే, ఆగస్టులో టెండర్లు పిలిచి నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు.

చిత్రం.. టెంపుల్ సిటీగా భద్రాద్రి తుది నమూనా