రాష్ట్రీయం

ఈ-ప్రగతితో కొత్త పంథా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఆగస్టు 1: కనిపించాల్సింది ప్రభుత్వం కాదని, పాలన మాత్రమేనని సిఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఆ దిశగానే పాలనా చర్యలు తీసుకుంటున్నామని, అందుకు ఈ ఏడాదిని ఈ-ప్రగతి సంవత్సరంగా ప్రకటిస్తున్నట్టు వెల్లడించారు. స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మంగళవారం నిర్వహించిన ఈ-ప్రగతి డిజిటల్ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా మాట్లాడుతూ ఐఎస్‌బి (ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్)ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడానికి చేసిన కృషిని వివరించారు. ఐఎస్‌బి, ట్రిపుల్ ఐటి, నల్సార్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేశామన్నారు. 20 ఏళ్ల క్రితమే నూతన ఆలోచనలతో ఇంటర్నెట్, ల్యాప్‌టాప్‌లతో బిల్‌గేట్స్ గ్లోబల్ విలేజ్‌ని తయారు చేశారన్నారు. నేడు నాలుగవ తరం పారిశ్రామిక విప్లవంలో భాగంగా ఐవోటి (ఇంటర్‌నెట్ ఆఫ్ థింగ్స్) వచ్చిందన్నారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానం వల్ల సంపద సృష్టితో పాటు ఉద్యోగాల కల్పన, పరిపాలనలో పారదర్శకత వస్తుందన్నారు. రాష్ట్రంలో రైతులకు, ప్రజలకు 45 నిమిషాల ముందుగానే పిడుగులు ఏ ప్రాంతంలో పడతాయనే సమాచారం తెలియజేస్తున్నామన్నారు. కోస్తా తీర ప్రాంతంలో వచ్చే వర్షాలు, తుపానుల సమాచారాన్ని కచ్చితత్వంతో కూడిన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. విశాఖపట్నంలో సంభవించిన హుదూద్ తుపాన్ వల్ల విద్యుత్ కష్టాలను వారంలోనే పరిష్కరించి, వీధుల్లో ఎల్‌ఈడి బల్బులు అమర్చి 40 శాతం విద్యుత్ ఆదా చేస్తున్నామని, స్కానర్ల ద్వారా వాటిని పర్యవేక్షిస్తున్నామని అన్నారు. అన్ని పంచాయతీల్లోనూ త్వరలో ఎల్‌ఈడిలు అమరుస్తామని, దీనివల్ల కోట్ల రూపాయలు ఆదా చేయగలిగామన్నారు. ఒక్కొక్క డిపార్ట్‌మెంట్ నుంచి నలుగురు చొప్పున 32 డిపార్ట్‌మెంట్ల నుంచి అధికారులను ఈ-ప్రగతి శిక్షణ కింద ఎంపిక చేశామన్నారు. ఈ-ప్రగతి అమలులో శిక్షణ తీసుకుంటున్న మొదటి బ్యాచ్ అధికారులు త్వరలో రాష్ట్రంలో, దేశంలో చరిత్ర సృష్టించబోతున్నారన్నారు. రోజు రోజుకీ టెక్నాలజీ మారుతోందని, దీనికి అనుగు ణంగా మనమూ మారకుంటే ప్రజలు విశ్వసించే అవకాశం ఉండదన్నారు. రాష్ట్రంలో ఈ-ప్రగతి, ఈ-ఆఫీస్, ఈ-క్యాబినెట్‌లు అమలవుతున్నాయన్నారు. ఈ-ప్రగతి అమలులో ఐటి మంత్రి, అధికారులకూ సవాళ్లు తప్పవన్నారు. మీడియా ఊహాగానాలతో కథనాలు రాయొద్దని, పూర్తి సమాచారం తీసుకున్న తరువాతే వార్తలు ఇవ్వడం వల్ల ప్రజలకు మెరుగైన సమాచారం వెళుతుందన్నారు. అధికారులు, పాలకులు కలిసి పనిచేస్తే టెక్నాలజీలో రాష్ట్రం అగ్రగామి కావడం కష్టం కాదన్నారు. ఇక మీదట ధ్రువపత్రాలు, సమాచారమంతా ఆన్‌లైన్‌లోనే లభ్యం కావాలని, ఇదే నా ఆకాంక్ష అన్నారు. అన్ని శాఖలు ఈ-ప్రగతి అమలుచేసే దిశగా ప్రయత్నం చేయాలని తెలిపారు. ఐటి, గ్రామీణాభివృద్ధి మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ దేశంలో 10 లక్షల ఐవోటి ఉపకరణాలు వినియోగిస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని, డ్రోన్ల సాయంతో గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నామన్నారు. రియల్ టైమ్ గవర్నెన్స్‌లో భాగంగా డిజిటల్‌గా ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంలో సిఎం చంద్రబాబు కృషి, పట్టుదల ఉందన్నారు.
ఐటి సెక్రటరీ విజయానంద్ మాట్లాడుతూ ఈ-ప్రగతి ప్రాజెక్టును సురక్షితంగా మార్చేందుకు బ్లాక్ చైన్ టెక్నాలజీని వినియోగించాలని నిర్ణయించామన్నారు. ప్రభుత్వ సలహాదారు జి.సత్యనారాయణ మాట్లాడుతూ ఈ-ప్రగతి ద్వారా రాష్ట్రానికి మంచి రోజులు వస్తున్నాయన్నారు. ఐటి ప్రత్యేక సలహాదారు జెఎ చౌదరి మాట్లాడుతూ ఈ-ప్రగతి అంశం రాష్ట్రంలో ప్రజావసరాలకు అనుగుణంగా ప్రభుత్వం టెక్నాలజీని అందిపుచ్చుకుంటుందన్నారు. ఐఎస్‌బి ప్రొఫెసర్ దీపామణి, ఐఎస్‌బిడీన్ రాజేంద్ర శ్రీవాత్సవ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఐఎస్‌బి విద్యార్థులు రాణిస్తున్నారన్నారు. కార్యక్రమంలో డిజిపి నండూరి సాంబశివరావు, మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కామినేని శ్రీనివాస్, నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్, ఈ-ప్రగతి సిఈవో బాలసుబ్రహ్మణ్యం, పారిశ్రామికవేత్తలు శ్రీనిరాజు, నీల్‌జాకబ్‌సన్ (సౌతాఫ్రికా), జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం, ఆర్‌టిజి సిఈవో బాబు.ఎ, విజయవాడ కమిషనర్ గౌతం సవాంగ్ తదితరులు పాల్గొన్నారు.
టెక్నాలజీలో నా మనవడే ముందున్నాడు
టెక్నాలజీ వినియోగంలో తన మనవడు దేవాన్షు తనకంటే ముందున్నాడని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతూ మురిసిపోయారు.

చిత్రం.. ఈ-ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న సిఎం చంద్రబాబు