రాష్ట్రీయం

పల్లెల్లో భూగర్భ డ్రైనేజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 1: రాష్ట్రంలో ఈ డిసెంబర్ చివరికి 10 వేల కిలోమీటర్లమేర భూగర్భ డ్రైనేజీ నిర్మించనున్నట్టు రాష్ట్ర పంచాయితీరాజ్ మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలో పంచాయితీరాజ్, ఉపాధిహామీ పథకం అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐదు వేలకంటే ఎక్కువ జనాభావున్న గ్రామాల్లో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుపై చర్చించారు. భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాల్సిన గ్రామాలు, ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక వివరాలను కలెక్టర్ల నుంచి సేకరించాలని ఆదేశించారు. 2600 కోట్ల రూపాయలతో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. ఉపాధిహామీ పథకం అనుసంధానంతో ఈ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ త్వరితగతిన ఏర్పాటు చేసేందుకు వీలుగా నిర్థిష్ట సమయాలతో సహా అధికారులకు లక్ష్యాలను నిర్దేశించారు. భూగర్భ డ్రైనేజీ వ్యవస్థకు సంబంధించి పరిపాలనా అనుమతులను ఆగస్టు 4లోగా ఇవ్వాలని ఆదేశించారు. 10వ తేదీలోగా సామగ్రి సరఫరా చేయాలని, 15న శంకుస్థాపన చేయాలని, సెప్టెంబర్ 1నుంచి భూగర్భ డ్రైనేజీ పనులు ప్రారంభించాలని ఆదేశించారు. డిసెంబర్ 1నాటికి వంద గ్రామాల్లో భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తికావాలని, డిసెంబర్ 31నాటికి 10 వేల కిలోమీటర్ల మేర పనులు పూర్తి చేయాలని లక్ష్యాలను నిర్దేశించారు. స్వచ్ఛ పంచాయితీలుగా అన్ని గ్రామాలను అభివృద్ధి చేసేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా భూగర్భ డ్రైనేజీ పనులు చేపట్టామని తెలిపారు. సమావేశంలో ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జవహర్ రెడ్డి, పంచాయితీరాజ్ కమిషనర్ రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీలపై అధికారులతో సమీక్షలో మంత్రి లోకేశ్