రాష్ట్రీయం

ఏపీకీ ఎక్స్‌ప్రెస్ హైవే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 1: అనంతపురం నుంచి అమరావతి వరకు ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణానికి సిఎం చంద్రబాబు నిర్ణయించారని రోడ్లు, భవనాల మంత్రి సిహెచ్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మీడియాతో మాట్లాడుతూ 393 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి 27 వేల కోట్లమేర ఖర్చవుతుందని అంచనా వేశామన్నారు. ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణానికి కేంద్రం అంగీకరించిందని, భూసేకరణ జరగాల్సి ఉందన్నారు. హైవే నిర్మాణం జరిగితే దేశంలో రెండో ఎక్స్‌ప్రెస్ హైవే ఇదే అవుతుందన్నారు. ఈ రహదారి ఐదు జిల్లాల మీదుగా వెళ్తూ రాజధాని అమరావతిని కలుపుతుందన్నారు. ఈహెచ్ పక్కనుంచే రైలుమార్గం కూడా వేయాలని నిర్ణయించారన్నారు. ఈహెచ్‌కు సంబంధించి ప్రభుత్వం భూసేకరణ చేస్తుందన్నారు. రాజమండ్రి నుంచి రంపచోడవరం, కెడి పేట, లంబసింగి, పాడేరు, అరకు, చింతపల్లి తదితర ప్రాంతాల నుంచి నిర్మించే డబుల్ రోడ్డు నిర్మాణం విజయనగరం కలెక్టరేట్ వద్ద ముగుస్తుందన్నారు. దాదాపు 440 కిలోమీటర్ల మార్గంలో నిర్వహించే రోడ్డు నిర్మాణానికి సంబంధించి డిపిఆర్ తయారవుతోందని వివరించారు. ఈ డబుల్ రోడ్డు నిర్మాణానికి మూడు వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశామన్నారు. ఒడిశాలోని మల్కన్‌గిరి నుంచి నర్సీపట్నం మీదుగా చోడవరం, సబ్బవరం రోడ్లకు అనుసంధానిస్తూ మరో ఎన్‌హెచ్ నిర్మిస్తున్నట్టు చెప్పారు. ఇది 284 కిలోమీటర్లమేర ఉంటుందని, అలాగే నర్సీపట్నం నుంచి తునివరకు హైవే వేయాలని నిర్ణయించామన్నారు. మొత్తం 884 కిలోమీటర్ల మేర రోడ్లకు డిపిఆర్ పూర్తికావాలని, రూ.1900 కోట్లతో నిర్మించనున్న రోడ్లకు 660 హెక్టార్లమేర భూసేకరణ చేపట్టాల్సి ఉందన్నారు. సబ్బవరం నుంచి నర్సీపట్నం మార్గమధ్యలో నాలుగు లైన్ల రోడ్డు వస్తుందన్నారు. మొత్తం నాలుగు బ్రిడ్జిలు, మరో నాలుగు బైపాస్‌లు రానున్నాయన్నారు. నర్సీపట్నం- సబ్బవరం మధ్య 11 బైపాస్‌లు వస్తాయన్నారు. ఈవిధంగా 55 కిలోమీటర్ల మార్గంలో బైపాస్‌లు వేయాలని, రానున్న రెండేళ్ళలో వీటిని పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు మంత్రి స్పష్టం చేశారు. ఇళ్ల స్థలాలు పోగొట్టుకునే పరిస్థితులు లేకుండా ఎక్కడికక్కడ రింగ్ రోడ్లు వస్తాయన్నారు. సాగునీటి కాల్వలు, టెలిఫోన్ కేబుల్స్ దెబ్బతినకుండా ఆయా విభాగాల మధ్య సమన్వయం ఏర్పర్చుకునేలా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ పని చేస్తుందన్నారు. అటవీ ప్రాంతాలు, మైదాన, గ్రామీణ ప్రాంతాలను కలుపుకుంటూ నిర్మించే రహదారుల వలన అన్నివిధాలా అభివృద్ధి జరుగుతుందన్నారు. అటవీ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి సంబంధించి ఐదు హెక్టార్లు దాటితే కేంద్రం నుంచి క్లియరెన్స్ రావాల్సి ఉందన్నారు. రోడ్ల నిర్మాణం భారీ ప్రాజెక్టులపై 15 రోజులకోసారి సమీక్ష నిర్వహించి పరిస్థితులు తెలుసుకోనున్నట్టు చెప్పారు. ప్రతి 50 కిలోమీటర్ల వద్ద వాహనాల డ్రైవర్లకు రెస్ట్‌రూంలు, టాయ్‌లెట్లు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రతిపాదనలు ఉన్నాయని అయ్యన్నపాత్రుడు వివరించారు.

చిత్రం.. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మీడియాతో మాట్లాడుతున్న మంత్రి అయ్యన్నపాత్రుడు