రాష్ట్రీయం

రియల్టీకి కళ్లెం రెరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 1: తెలంగాణ స్థిరాస్తి నియంత్రణ, అభివృద్ధి చట్టం (రెరా)కు సిఎం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రభుత్వం మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (రెరా) చట్టానికి అనుగుణంగా రెగ్యులేటరీ అథారిటీని ప్రభుత్వం రూపొందించింది. ఈ చట్టాన్ని జూలై 31లోగా రాష్ట్రాలు ఏర్పాటు చేసుకోవాలని కేంద్రం ఆదేశించడంతో గడువులోగా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. నోటిఫికేషన్‌పై అభ్యంతరాలను ఆగస్టు 15 వరకు స్వీకరిస్తారు. నోటిఫికేషన్ ముసాయిదాకు అభ్యంతరాల స్వీకరణ తర్వాత తెలంగాణ స్థిరాస్తి నియంత్రణ, అభివృద్ధి చట్టానికి మంత్రిమండలి ఆమోదం తెలుపుతుంది. సెప్టెంబర్ 1 నుంచి చట్టం అమలులోకి వస్తుంది. రాష్టవ్య్రాప్తంగా నగరాలు, పట్టణాల్లో జనవరి ఒకటి 2017 తర్వాత అనుమతి పొందిన నిర్మాణాలు ఈ చట్టం పరిధిలోకి రానున్నాయి. డిసెంబర్ 31, 2016 నాటికే అనుమతి పొందివుంటే వాటికి చట్టం నుంచి మినహాయింపు ఇచ్చినట్టు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. సెప్టెంబర్ ఒకటి తర్వాత ప్రారంభించే గృహ, వాణిజ్య సముదాయాలు తప్పనిసరిగా తెలంగాణ స్థిరాస్థి నియంత్రణ, అభివృద్థి చట్టం కింద అనుమతి పొందాల్సి ఉంది. అనుమతి లేకుండా ప్రకటించే రియల్ ఎస్టేట్ వెంచర్లు, అపార్టుమెంట్లు, వాణిజ్య సముదాయాలు, గేటెడ్ కమ్యూనిటీలకు భారీ జరిమాన విధిస్తారు. ఐదు వందల మీటర్ల విస్థీర్ణంలో నిర్మించే నిర్మాణాలు చట్టం పరిధిలోకి వస్తాయి. కొత్తచట్టంతో లాభాలు స్థిరాస్తి నియంత్రణ, అభివృద్ధి చట్టం నిర్మాణదారుల కంటే కొనుగోలుదారుల ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. నివాస భవనం, అపార్టుమెంట్లు, విల్లాలు, వాణిజ్య సముదాయాల్లో కొనుగోలుదారులకు అన్ని విధాలుగా చట్టం అండగా నిలుస్తుంది. ఒప్పందం మేరకు గడువులోగా భవనాలను అప్పగించని పక్షంలో కొనుగోలుదారులకు గడువు ముగిసిన నాటి చెల్లించిన మొత్తానికి వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుంది. కుదిరిన ఒప్పందం మేరకు మెటీరియల్ వాడకపోయినా, ఉపయోగించిన సిమెంట్, స్టీల్, కలప, ప్లంబింగ్, వైరింగ్, ఫ్లోరింగ్, ఫినిషింగ్ వస్తుసామాగ్రిలో నాణ్యత లోపించిన నిర్మాణదారుల నుంచి పరిహారాన్ని తిరిగి ఇప్పించడంతోపాటు నిబంధనలను ఉల్లంఘించిన నేరానికి బిల్డర్‌గా పొందిన అనుమతిని రద్దు చేస్తారు.
కొనుగోలుదారులను ముప్పుతిప్పలు పెడుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ముకుతాడు వేయడానికి కేంద్రం రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ యాక్ట్‌ను (రెరా) మార్చి 2017లో తీసుకొచ్చింది. మే ఒకటి నుంచి చట్టం దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చింది. చట్టాన్ని అమలు చేయడానికి ప్రతి రాష్ట్రం తప్పనిసరిగా రెగ్యులేటరీ అథారిటీ (ఆర్‌ఏ) ఏర్పాటు చేసుకోవడానికి జూలై 31న గడువు విధించింది. గడువులోగా ఆర్‌ఏ ఏర్పాటు చేసుకోవాల్సి ఉండటంతో చివరి రోజున తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. రెగ్యులేటరీ అథారిటీ చైర్మన్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని నియమించనున్నట్టు పేర్కొంది. రెగ్యులేటరీ అథారిటీలో సంబంధిత అధికారులతో పాటు నిర్మాణదారులు, కొనుగోలుదారుల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.