రాష్ట్రీయం

రియల్టీదే భవిష్యత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 11: తెలంగాణలో రియల్ ఎస్టేట్‌కు ఉజ్వల భవిష్యత్ ఉందని, విభజనతో హైదరాబాద్‌లో మార్కెట్ పడిపోతుందనే ప్రచారం తప్పని రుజువైందని మున్సిపల్ వ్యవహారాల మంత్రి కె తారక రామారావు తెలిపారు. బిల్డర్లకు అన్ని రకాల అనుమతులు ఒకేచోట లభించేలా సింగిల్ విండో విధానం అమలు చేయబోతున్నట్టు కెటిఆర్ తెలిపారు. శుక్రవారం జరిగిన తెలంగాణ బిల్డర్స్ అసోసియేషన్ మూడో వార్షికోత్సవం కెటిఆర్ మాట్లాడారు. కాలుష్య నియంత్రణ సర్ట్ఫికెట్లతోపాటు అన్ని అనుమతులు ఒకేచోట సింగిల్ విండో విధానంలో లభిస్తాయన్నారు. నవంబర్ చివరినాటికి మెట్రో పనులు పూర్తిచేసి నాగోల్ నుంచి మియాపూర్ వరకు ప్రారంభించనున్నట్టు చెప్పారు. నగరంలో కొత్తగా నాలుగు స్కైవేలను నిర్మించనున్నట్టు చెప్పా రు. హైదరాబాద్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా రెండేళ్లలో నగరంలో సుమారు 290 కిలోమీటర్లకు పైగా రోడ్లను త్వరలో వైట్ ట్యాపింగ్ రోడ్లుగా మార్చనున్నట్టు కెటిఆర్ తెలిపారు.
తెలంగాణ ఏర్పడితే రియల్ ఎస్టేట్ పడిపోతుందని, విద్యుత్ లేక చీకటిమయం అవుతుందని ప్రచారం చేశారని, కానీ అలా ఏమీ జరగలేదని తెలిపారు. విద్యుత్ ఉండదని అప్పుడు సిఎంగావున్న కిరణ్‌కుమార్‌రెడ్డి అబద్ధాలు ప్రచారం చేశారని, కానీ విద్యుత్ కోతలు లేని తెలంగాణను చూస్తున్నామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌లో వేసవిలో విద్యుత్ కోతలు సర్వసాధారణంగా ఉండేవని, పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటించేవారని, కానీ ఇప్పు డు పరిశ్రమలకు, వ్యవసాయానికి 24 గంటల పాటు విద్యుత్ అందివ్వగలుతున్నామని కెటిఆర్ తెలిపారు. నవంబర్ 2017 నుంచి మార్చి 2018 మధ్యకాలంలో హైదరాబాద్ మూడు ప్రధాన అంతర్జాతీయ కార్యక్రమాలకు ఆతిథ్యం ఇవ్వబోతోందని తెలిపారు. వీటిలో అంతర్జాతీయ వ్యాపార వేత్తల సదస్సు, భారత సైన్స్ కాంగ్రెస్, ప్రపంచ ఐటి కాంగ్రెస్ ఉందని తెలిపారు. రాష్ట్రంలో వౌలిక వసతులు, సుందరీకరణ ప్రాజెక్టుల కోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు తీర్చి దిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతున్నట్టు
తెలిపారు. వచ్చే ఎనిమిదేళ్లలో హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరంగా తీర్చి దిద్దడానికి పలు కార్యక్రమాలు చేపట్టినట్టు కెటిఆర్ తెలిపారు.
నగర శివార్లలో పంచాయితీలు, సబ్ అర్బన్ ప్రాంతాల్లో కూడా గణనీయమైన అభివృద్ధి కనిపిస్తున్నప్పటికీ అమలులో ఉన్న చట్టాలు ఇక్కడ సరిగా అమలు కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. బిల్డర్లు తమకు తాము నియంత్రణ విధించుకోవడంతో పాటు నిర్మాణాత్మక వృద్ధి సాధించాల్సి ఉందని అన్నారు. బిల్డర్లు తమకు తాము నియంత్రణ విధించుకోవడంతో పటు నిర్మాణాత్మక వృద్ధి సాధించాల్సి ఉందని అన్నారు. త్వరలోనే జిహెచ్‌ఎంసిలోని శాటిలైట్ పంచాయితీలు అన్నింటినీ కలిపేయబోతున్నట్టు చెప్పారు. అప్పుడు నిబంధనలకు అనుగుణంగా లేని ప్రతి ఒక్క వెంచర్ భారీ జరిమానాలు ఎదుర్కోవలసి ఉంటుందని అన్నారు. ఆ పరిస్థితి రాకుండా ఉండేందుకు బిల్డర్లు కచ్చితంగా తమ ప్రస్తుత ప్రాజెక్టులలో పూర్తిగా నిబంధనలు అమలు చేయాలని కెటిఆర్ సూచించారు.
మార్టిగేజ్ నిబంధనలు మినహాయించాలి
పది శాతం మార్టిగేజ్ నిబంధనల నుంచి భవంతులను మినహాయించాలని తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ కోరింది. స్టాంపు డ్యూటీని గణనీయంగా తగ్గించడంతో పాటు రాష్ట్రంలో నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించేందుకు మార్టిగేజ్ నిబంధనలను సడలించాలని తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు సి ప్రభాకర్‌రావు కోరారు. త్వరలోనే ఫెడరేషన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. బిల్డింగ్ మార్టిగేజ్ నిబంధనల నుంచి భవనాలను మినహాయించాలని కోరారు. ప్రధాన కార్యదర్శి వెంకట్‌రెడ్డి, జిహెచ్‌ఎంసి కమీషనర్ బి జనార్దన్‌రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ సోమేష్ కుమార్, మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

చిత్రం.. బిల్డర్స్ అసోసియేషన్ సమావేశంలో జ్యోతి ప్రజ్వలన చేస్తున్న మంత్రి కెటిఆర్