రాష్ట్రీయం

సెప్టెంబర్‌లో రెండో విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 11: రాష్ట్రాన్ని కుదిపేసిన మాదక ద్రవ్యాలు కేసులో తొలి భాగం విచారణ పూర్తయ్యింది. సినిమా రంగానికి చెందిన వారిని సుధీర్ఘంగా విచారించిన ఎక్సైజ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సెప్టెంబర్‌లో రెండో విడత విచారణ చేపట్టనుంది. డ్రగ్స్‌తో సంబంధం ఉన్న వారి రెండవ జాబితాను తయారుచేస్తున్నట్లు ఆయన చెప్పారు. శుక్రవారం తనను కలిసిన విలేకరులతో ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టర్ అకున్‌సభర్వాల్ మాట్లాడుతూ సినిమా వాళ్ల విచారణ పూర్తయిందని, త్వరలో రెండో జాబితా విచారణకు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. 11 కేసులకు సంబంధించిన నేరారోపణ పత్రాలు త్వరగానే కోర్టులో దాఖలు చేస్తామని స్పష్టం చేశారు. డ్రగ్స్ కేసుల విచారణలో తమపై ఎలాంటి ఒత్తిళ్లు లేవని అకున్ సభర్వాల్ స్పష్టం చేశారు. డ్రగ్స్ కేసుల్లో విచారణ పూర్తి చేసిన వారికి సంబంధించిన రక్తనమూనాలు, ఇతరత్రా వాటిని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించామని, నివేదిక కోసం వేచి చూస్తున్నామని చెప్పారు. ఫోరెన్సిక్ నివేదిక అందగానే సమగ్రంగా పరిశీలించి పూర్తి ఆధారాలతో నేరారోపణ పత్రాలను కోర్టులో దాఖలు చేస్తామని చెప్పారు. ఈ కేసులో మరికొందరిని విచారించిన తర్వాతే సమగ్ర వివరాలను వెల్లడించగలమని తెలిపారు.