రాష్ట్రీయం

డేంజర్ నంద్యాల!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, ఆగస్టు 17: ఉప ఎన్నికల నేపథ్యంలో నంద్యాల నియోజకవర్గంలో హింస చెలరేగే అవకాశముందని, వెంటనే అదనపు బలగాలు పంపాలంటూ కర్నూలు జిల్లా పోలీసులు డిజిపి సాంబశివరావుకు నివేదిక పంపినట్లు తెలిసింది. నిఘా విభాగం అధికారుల సమాచారాన్ని డిజిపికి వివరిస్తూ శాంతిభద్రతలను అదుపులో పెట్టేందుకు సాయుధ బలగాలను పంపాలని కోరినట్లు సమాచారం. ఇప్పటికే నంద్యాలలో నెలకొన్న పరిస్థితులపై కేంద్ర బలగాల కోసం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సత్యనారాయణ ఎన్నికల కమిషన్‌కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. తాజాగా నియోజకవర్గంలో అశాంతియుత పరిస్థితులపై డిజిపికి నివేదిక వెళ్లడం చర్చనీయాంశమైంది. ఇదే అంశంపై సిఎం చంద్రబాబు సైతం తమ పార్టీ నేతలతో అమరావతిలో చర్చించి ఎక్కడా చిన్న సంఘటనకు తావు లేకుండా చూసేందుకు పోలీసులకు సహకరించాలని సూచించినట్లు తెలుస్తోంది. వైకాపా హింసను ప్రేరేపించే అవకాశముందన్న సమాచారం తనకు అందిందని, కాబట్టి పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని ఆయన సూచించినట్లు తెలుస్తోంది.
కాగా జిల్లా పోలీసు అధికారుల నివేదికపై స్పందించిన డిజిపి శుక్ర, శనివారం నాటికి సాయుధ పోలీసు బలగాలు నంద్యాలకు చేరుకుంటాయని సమాచారం ఇచ్చారని అంటున్నా రు. శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా పోలీసులు సమస్యాత్మక గ్రామాల్లో తనిఖీలు చేపట్టాలని, నేరచరితులను అదుపులోకి తీసుకోవాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. నంద్యాల పట్టణంలో కూడా అనుమానితులను ప్రశ్నించి అవసరమైతే వారిని కోర్టుకు హాజరుపర్చడం, తహశీల్దారు ముందు బైండోవర్ చేయడం లాంటి కార్యక్రమాన్ని వెంటనే పూర్తి చేయాలని సూచించినట్లు తెలుస్తోంది.