రాష్ట్రీయం

పరిశ్రమలకు భూమ్‌లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 17: హైదరాబాద్ ఫార్మా సిటీ, మెడికల్ డివైజెస్ పార్కుల్లో పరిశ్రమల స్థాపనకు వివిధ ఫార్మా కంపెనీలు ఆసక్తి చూపుతున్నట్టు ఐటి, పరిశ్రమల మంత్రి కె తారక రామారావు వెల్లడించారు. పరిశ్రమల శాఖపై మంత్రి గురువారం సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే పలు పరిశ్రమల నుంచి వచ్చిన ప్రతిపాదనల్లో 8500 ఎకరాల వరకూ డిమాండ్ ఉన్నట్టు ప్రాథమికంగా అంచనా వేశారు. త్వరలోనే పర్యావరణ అనుమతులపై ప్రజాభిప్రాయ సేకరణ ఉంటుందన్నారు. స్థానికులకు ఫార్మా సిటీతో కలిగే లాభాలు, ఉద్యోగాలు, పార్క్‌లో జీరో లిక్విడ్ డిచార్జ్ ఉన్నందున ఎలాంటి కాలుష్యం ఉండదన్న విషయాలను వివరించాలని సమావేశంలో నిర్ణయించారు. మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఐటి, పరిశ్రమల శాఖపై కెటిఆర్ విస్తృస్థాయి సమీక్ష జరిపారు. ప్రభుత్వం గత మూడేళ్లలో వైవిధ్యమైన విధానాలను అమల్లోకి తీసుకొచ్చిందని, అయితే ఇక రెండేళ్లపాటు పాలసీల్లో హామీఇచ్చిన అంశాల అమలును మరింత వేగవంతం చేయాలని నిర్ణయించామన్నారు. ప్రభుత్వ పాలసీలకు దేశవ్యాప్తంగా ప్రసంశలు లభించాయని, ఈమేరకు రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు, పెట్టుబడులే ప్రాతిపదికగా పని చేయాలని అధికారులను ఆదేశించారు. ఇకపై ప్రతి మూడు నెలల్లో సాధించే శాఖాపరమైన మైలురాళ్లను ముందే ప్రకటించాలని అన్నారు. ఈ మైలురాళ్లను అందుకోలేని అధికారులపై కఠినంగా వ్యవహరించేందుకు వెనకాడబోమని మంత్రి హెచ్చరించారు. గత ఏడాది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తో దేశంలో మొదటిస్థానంలో నిలిచామని, ఈసారి అదే స్థానాన్ని కొనసాగించేలా పని చేయాలని అధికారులకు సూచించారు. ఏరో స్పెస్ రంగంలో మరిన్ని పెట్టుబడులు తీసుకొచ్చేలా ప్రయత్నాలు చేయాలన్నారు. ఇప్పటికే పలు ప్రతిష్టాత్మక కంపెనీలు నగరంలో ఉన్నాయని, వీటికితోడు మరిన్ని అంతర్జాతీయ కంపెనీలను నగరానికి తీసుకురావాలని అన్నారు. తెలంగాణ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు, మిషన్ భగీరథ ప్రాజెక్టుతో సమన్వయం చేసుకుంటున్నట్టు చెప్పారు. మిషన్ భగీరథ ప్రాజెక్టుతోపాటే తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కూడా పూర్తవుతుందని అన్నారు. టాస్క్ ద్వారా ఇప్పటివరకు ప్రదానంగా ఇంజనీరింగ్ విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నామని, త్వరలో శిక్షణ కార్యక్రమాలను హెల్త్ సెక్టార్, ఫార్మా, ఆటోమోటివ్స్ రంగాలకు విస్తరించనున్నట్టు చెప్పారు. టాస్క్ కేంద్రాలను జిల్లాలకు విస్తరించేందుకు దశలవారీగా ప్రయత్నాలు ప్రారంభించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

చిత్రం..ఫార్మా సిటీ ప్రగతిపై సమీక్ష నిర్వహిస్తున్న మంత్రి కెటిఆర్