రాష్ట్రీయం

రాష్ట్రానికి వర్ష సూచన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 19: ఉత్తర కోస్తా పరిసర ప్రాంతాలను ఆనుకుని అల్పపీడనం ఏర్పడింది. దీనికి సమాంతరంగా వాయువ్య దిశలో 7.6 కిమీ ఎత్తున ఉపరితల ఆవర్తనం నెలకొందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు శనివారం రాత్రి తెలిపారు. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు, తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ దిశగా గాలులు వీస్తాయని, సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకూ కూనవరం, ఎలేరుపాడు, వరరామచంద్రపురంలో 7 సెంటీమీటర్లు, చింతపల్లి 6 సెంమీ, నర్సీపట్నం, నందిగామ, చింతలపూడిలో 5 సెంమీ వర్షపాతం నమోదైంది.
ఇదిలావుంటే, తెలంగాణ రాష్టవ్య్రాప్తంగా శుక్ర, శనివారాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిశాయి. మరో 24 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్‌లో భారీ వర్షం నమోదైంది.