రాష్ట్రీయం

నా కష్టమే మీ సుఖం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల, ఆగస్టు 19: ముఖ్యమంత్రిగా నేను రోజుకు 18 గంటలపాటు కష్టపడి పనిచేస్తున్నా. ప్రజల సుఖం కోసం అహర్నిశలు కష్టపడుతూనే ఉంటానని సిఎం చంద్రబాబు స్పష్టం చేశారు. నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం నిర్వహించిన రోడ్ షోలో మాట్లాడుతూ రాష్ట్భ్రావృద్ధికి తాను నిరంతరం శ్రమిస్తున్నానన్నారు. తాను కష్టపడుతూ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులను పరుగులు పెట్టిస్తున్నానన్నారు. విశాఖలో హుదుద్ తుఫాన్‌ను సమర్థవంతంగా ఎదుర్కొని నేడు స్మార్ట్‌సిటీగా అభివృద్ధి చేశానన్నారు. హుదుద్ తుఫాన్ అనంతరం నెల రోజులపాటు బస్సులోనే ఉండి పనులు చేయించానన్నారు. రాష్ట్ర విభజన హేతుబద్దంగా జరగలేదని, రూ. 16 వేల కోట్ల లోటు బడ్జెట్‌తో రాష్ట్ర పగ్గాలు చేపట్టిన వెంటనే రైతులకు రూ.24 వేల కోట్ల రుణమాఫీ చేశానన్నారు. రైతుబిడ్డగా రైతు రుణం తీర్చుకునేందుకు కృషి చేస్తున్నానన్నారు. గోదావరి నుంచి ప్రతి ఏటా 4 వేల టిఎంసిల నీరు సముద్రం పాలవుతుందని, ఆ నీటిని పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా కృష్ణాడెల్టాకు మళ్లించి 12 లక్షల హెక్టార్లలో పంటలు పండేలా కృషి చేసిన విషయం ప్రతిపక్ష నేతకు కనపడలేదా? అన్నారు. పట్టిసీమ ద్వారా గోదావరి నీటిని కృష్ణాడెల్టాకు తరలించి అక్కడ ఆదా చేసిన నీటిని పోతిరెడ్డిపాడు ద్వారా సీమ ప్రాంతంలో తాగునీరు, సాగునీటి అవసరాలకు మళ్లిస్తున్నామన్నారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి గత ఏడాదే సాగునీరు అందించామన్నారు. కాంగ్రెస్ పదేళ్ల కాలంలో జలయజ్ఞాన్ని నిర్వహించి ధనయజ్ఞంగా మార్చుకుని ప్రజాధనాన్ని లూటీ చేసిందన్నారు. రాష్ట్రంలోని 28 సాగునీటి ప్రాజెక్టులను మరో మూడు నెలల్లో పూర్తి చేస్తామని చంద్రబాబు అన్నారు. ఓ పక్క పోలవరం ప్రాజెక్టు పనులు యుద్ధప్రాతిపదికన చేయిస్తూ మరోవైపు సీమ ప్రాంతంలోని 16 సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తిచేసి సీమను సస్యశ్యామలం చేస్తామన్నారు. తాను చేస్తున్న యజ్ఞాన్ని భగ్నం చేయాలని కుట్ర చేస్తున్న వైకాపాకు బుద్ది చెప్పాలన్నారు. రాష్ట్రం విడిపోయి కట్టుబట్టలతో బయటకు వచ్చిన అనంతరం పరిపాలనకు రాజధాని లేకపోయినా విజయవాడ నగరంలోని క్యాంపు ఆఫీసులో బస్సులో ఉంటూ మూడు నెలల పాటు రాష్ట్ర అభివృద్ధి కోసం చిత్తశుద్దితో పనిచేశానన్నారు. అమరావతిని ప్రపంచంలోనే సుందర నగరంగా అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. జాతీయ, విదేశీ సంస్థలను రాష్ట్రానికి తీసుకువస్తూ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్న విషయం ప్రతిపక్షానికి కనపడలేదా అన్నారు. నంద్యాలను పులివెదుల చేస్తానని అవతలివారు అంటున్నారని, ఆ సంస్కృతి మనకు అవసరమా, పులివెదులకు చెడ్డపేరు తీసుకువచ్చింది వారు కాదా, అక్కడ ఎవరికీ స్వేచ్ఛ లేదు. ఎవరైనా మాట్లాడితే పైకి పోవాల్సిందే. రాయలసీమలో శాంతి కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడుతున్నానన్నారు. అభివృద్ధి కోసం టిడిపికి ఓటు వేయాలని సిఎం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ రోడ్‌షోలో మంత్రి భూమా అఖిల ప్రియ, టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి, టిడిపి నాయకులు ఎవి సుబ్బారెడ్డి, సజ్జల శ్రీ్ధర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎన్‌ఎండి ఫరూక్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..నంద్యాలలో జరిగిన రోడ్ షోలో ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు