రాష్ట్రీయం

7జిల్లాల్లో హై ఓల్టేజ్ విద్యుత్ పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 13: ఆంధ్రప్రదేశ్‌లో హైవోల్టేజి విద్యుత్ పంపిణీ పథకాన్ని అమలు చేయనున్నారు. సామర్థ్యంలేని పంపుసెట్లను మార్చి వాటి స్థానంలో నాణ్యమైనవి అమర్చి, విద్యుత్‌ను ఆదాచేయడం ఈ పథకం లక్ష్యం. ఇది నిజంగా రైతులకు శుభవార్తే. జపాన్ ఇంటర్నేషనల్ కో ఆపరేటివ్ ఏజన్సీ మంజూరు చేసిన రూ.294.75 కోట్లతో మొదట దీనిని ప్రారంభిస్తారు. రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో 46,727 పంపుసెట్లకు ఈ పథకాన్ని వర్తింప చేస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రాష్ట్రంలో విద్యుత్‌రంగం పరిస్థితిపై బుధవారంనాడు అధికారులతో ఆయన సమీక్ష జరిపారు.
ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకాన్ని తొలిదశలో జిల్లాకో మండలంలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తారని ఆయన చెప్పారు. వ్యవసాయ రంగంలో ప్రామాణికత ఉన్న పంపుసెట్ల వినియోగంవల్ల సాలీనా మూడు వేల ఎంయు విద్యుత్ ఆదా అవుతుందని, ఈ పథకానికి కేంద్రం ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిందని ఆయన చెప్పారు.
వ్యవసాయంకోసం లోవోల్టేజి విద్యుత్ లైన్లకు బదులుగా హైవోల్టేజి విద్యుత్ లైన్లను వేస్తారన్నారు. ఈ పథకం కింద ఇంతవరకు 8,14,890 వ్యవసాయ పంపుసెట్లకు రూ.3233.911 కోట్లు ఖర్చుపెడుతున్నామన్నారు. సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఇంధన కార్యదర్శి అజయ్ జైన్, ఏపి ట్రాన్స్‌కో సిఎండి కె విజయానంద్ ముఖ్యమంత్రికి రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితిని వివరించారు. హైవోల్టేజి పంపిణీ పథకం అమలు వల్ల సాలీనా రూ.76.72 కోట్ల విద్యుత్ ఆదా అవుతుందని, తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో దీనిని ప్రయోగాత్మకంగా అమలు చేశామని వారు చంద్రబాబుకు వివరించారు. ఈ విధానంవల్ల 30 శాతం వరకు విద్యుత్ ఆదా అవుతుందన్నారు.
దీనిపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ రైతులకు రోజుకు ఉచితంగా ఏడు గంటలు విద్యుత్ అందించడానికి సాలీనా రూ. 3200 కోట్లను ప్రభుత్వం డిస్కంలకు అందిస్తున్నామని, కొత్త సంవత్సరంలో రాష్ట్రాన్ని కరవు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ప్రధాన జలాశయాలు పోలవరం, హంద్రీ-నీవా సుజల స్రవంతి, గాలేరు నగరి సుజల స్రవంతి, వెలిగొండ, వంశధార తదితర పథకాలను యుద్ధప్రాతిపదికన పూర్తిచేస్తామన్నారు. రైతులకు పగలే ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని ఆయన అధికారులకు సూచించారు.