రాష్ట్రీయం

పారిశ్రామిక కాలుష్యంపై పార్లమెంట్‌కు నివేదిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, ఆగస్టు 27: సైన్స్, టెక్నాలజీ, పర్యావరణం, అటవీ శాఖల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్‌పర్సన్ రేణుకా చౌదరి నేతృత్వంలోని ప్రతినిధి బృందం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సింగరేణి కాలరీస్ ఓపెన్ కాస్ట్, పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (కెటిపిఎస్)లను ఆదివారం సందర్శించారు. పరిశ్రమల నుంచి విడుదలయ్యే వ్యర్థ పదార్థాలు ప్రజారోగ్యానికి హాని కలిగిస్తున్నాయని, అలాంటి పరిశ్రమలపై చర్యలు తీసుకునేందుకు దేశవ్యాప్తంగా పర్యటించి పార్లమెంటుకు నివేదిక అందిస్తామని కమిటీ చైర్‌పర్సన్ రేణుకా చౌదరి ఈసందర్భంగా తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని హెవీ వాటర్ ప్లాంట్, భద్రాచలం పేపర్ బోర్డు నుంచి వెలువడే వ్యర్థ పదార్థాలను గోదావరి నదిలో కలపటం వల్ల కలిగే నష్టాలపై చర్చిస్తామన్నారు. కొత్తగూడెం ప్రాంతంలోని గౌతంఖని ఓపెన్‌కాస్ట్‌ను సందర్శించిన అనంతరం పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సింగరేణిలో పర్యావరణ పరిరక్షణ, కార్మికుల సంక్షేమం, బొగ్గు ఉత్పత్తిలో సాంకేతిక పరిజ్ఞానంపై ప్రతినిధి బృందానికి సింగరేణి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ శ్రీ్ధర్ వివరించారు. పర్యావరణ పరిరక్షణకు సింగరేణి వ్యాప్తంగా కోటి మొక్కలు నాటినట్లు చెప్పారు. కెటిపిఎస్ 6, 7 దశల్లో విద్యుత్ ఉత్పత్తిపై చర్చించారు. పరిశ్రమల్లో కార్మిక సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలపై స్టాండింగ్ కమిటీ ప్రతినిధి బృందం పార్లమెంట్‌కు నివేదిక అందిస్తుందని చైర్‌పర్సన్ రేణుకా చౌదరి వివరించారు. స్టాండింగ్ కమిటీకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు స్వాగతం పలికారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులు సుఖ్‌రాం సింగ్ యాదవ్, రంగసాయి రామకృష్ణ, రాజేంద్ర సింగ్, విక్రమ్ హుస్సేన్ బీ, నానాపటార్, శివాజీ పాటిల్, సిపి నారాయణన్, ప్రసన్న ఆచార్య, బాలసుబ్రహ్మణ్యన్, తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..సింగరేణిలో సాంకేతిక పరికరాలను పరిశీలిస్తున్న పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులు