రాష్ట్రీయం

తెలుగు రాష్ట్రాల్లో 5 కేంద్రీయ విద్యాలయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 28: దేశవ్యాప్తంగా 1160 కోట్ల రూపాయిల వ్యయంతో 50 కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్రప్రభుత్వం ఆమోదం తెలిపింది. తొలి జాబితాలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐదు స్కూళ్ల ఏర్పాటుకు ఆమోదం లభించింది. ఈ ఐదు స్కూళ్లు ఈ విద్యాసంవత్సరం నుండే ప్రారంభం అవుతాయి. కాగా రెండు రాష్ట్రాల్లో మరో 9 చోట్ల పాఠశాలల ఏర్పాటుకు పరిశీలన జరుగుతోంది. దేశవ్యాప్తంగా ఈ పాఠశాలలు ఈ విద్యాసంవత్సరంలోనే 1 నుండి 5వ తరగతి వరకూ ప్రారంభం అవుతాయి. ఆ తర్వాత ఏటా ఒక్కో తరగతి పెంచుకుంటూ ఐదేళ్లలో 12వ తరగతిని ప్రారంభిస్తాయి. ఈ పాఠశాలలకు మొత్తం 4వేల మంది బోధన, బోధనేతర సిబ్బంది అవసరమని కేంద్రం యోచిస్తోంది.
అందులో 2900 మంది బోధన, 1100 మంది బోధనేతర సిబ్బందిని రెగ్యులర్ ప్రాతిపదికపై నియమిస్తారు. మిగిలిన అవసరాలకు తాత్కాలిక ప్రాతిపదికన నియమిస్తారు. ఈ విద్యాసంవత్సరంలో 650 పోస్టులను భర్తీ చేస్తారు. దీనివల్ల దేశవ్యాప్తంగా 50వేల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది. పాఠశాలల ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేసిన కేంద్రప్రభుత్వం కనీస వౌలిక సౌకర్యాలను కల్పించేందుకు ముందుకు వచ్చిన రాష్ట్రాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. దాని ప్రకారం వివిధ రాష్ట్రాలు 35 పాఠశాలల ఏర్పాటుకు ముందుకు రాగానే కేంద్రీయ విద్యాలయ సంఘటన్ గవర్నింగ్ బోర్డు వాటికి ఆమోదం తెలిపింది. ప్రధానంగా సమీపంలో ఒక్కటి కూడా కేంద్రీయ విద్యాలయం లేని ప్రాంతాలకు ప్రాధాన్యం ఇచ్చింది. ఆ తర్వాత మరో 16 పాఠశాలల ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చాయి. వాటికి గవర్నింగ్ కౌన్సిల్ ఒకటి రెండు రోజుల్లో ఆమోదం తెలపనుంది. తొలి దశలో పాఠశాలలు దక్కించుకున్న రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండూ ఉన్నాయి. తెలంగాణలో భువనగిరి, నిజామాబాద్ ఉండగా, ఆంధ్రాలో ఒంగోలు, రాజంపేట, సత్తెనపల్లి ఉన్నాయి. భువనగిరి పాఠశాలను ఎ.ఎల్.ఎన్ రెడ్డి మెమోరియల్ బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తాత్కాలికంగా ప్రారంభిస్తారు. సొంత భవనం ఏర్పాటైన తర్వాత దానిని బదిలీ చేస్తారు. కాగా హకీంపేట, మిర్యాలగూడ, తెనాలి, మంచిర్యాల, రాజంపేట, సిరిసిల్ల, జరాసంగం, కాకినాడ, బోధన్ తదితర పట్టణాల్లో కూడా కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు ప్రభుత్వ పరిశీలన జరుగుతోంది. కనీసం 5వేల మంది కేంద్ర సర్వీసు ఉద్యోగులు పనిచేస్తున్న చోట వీటిని ప్రారంభించడం వల్ల ప్రయోజనం ఉంటుందని ప్రభుత్వం యోచిస్తోంది.