రాష్ట్రీయం

కొత్త పిటిషన్లను ఆపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 29: టిడిపి నేతలపై నమోదైన క్రిమినల్ కేసులను ఉపసంహరించుకోవాలన్న జీవోపై సంబంధించిన కోర్టుల్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు దరఖాస్తులను దాఖలు చేసే ప్రక్రియను వాయిదా వేయాలని కోరుతామని ఏపి అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ హైకోర్టుకు తెలిపారు. ఈ జీవోను సవాలు చేస్తూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం విచారించింది. దాదాపు 273మంది టిడిపి నేతలపై కేసులను ఉపసంహరించుకుంటూ రాష్ట్రప్రభుత్వం జీవోలు జారీ చేసిందని ఆయన కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసుల వివరాలను పిటిషనర్ న్యాయవాది పి సుధాకర్ రెడ్డి కోర్టుకు తెలిపారు. ఈ సందర్భంగా ఏపి ఏజి వాదనలు వినిపిస్తూ కేసులను ఉపసంహరించుకునే హక్కు రాష్ట్రప్రభుత్వానికి ఉందని సుప్రీంకోర్టు పేర్కొన్నదని తెలిపారు. ఈ విషయమై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసేందుకు గడువు ఇవ్వాలని ఆయన ధర్మాసనాన్ని కోరారు. కాగా ఈ కేసు పెండింగ్‌లో ఉన్నందు వల్ల పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కోర్టుల్లో కేసులను ఉపసంహరించుకుంటూ దరఖాస్తులను దాఖలు చేయకుండా చూడాలని హైకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలను పాటిస్తామని హైకోర్టుకు ఏజి దమ్మలపాటి శ్రీనివాస్ తెలిపారు. అనంతరం ఈ కేసులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసేందుకు హైకోర్టు మూడు వారాల గడువును ఏపి ప్రభుత్వానికి ఇచ్చింది.
బాలయ్యపై చర్య తీసుకోండి
నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో ఓటర్లకు హిందూపూర్ ఎమ్యెల్యే, సినీనటుడు బాలకృష్ణ డబ్బులు పంచాడని అభియోగం మోపుతూ, ఆయనపై ఎన్నికలు సంఘం చర్యలు తీసుకునే విధంగా ఆదేశాలు ఇవ్వాలంటూ వైకాపా ప్రధాన కార్యదర్శి కె శివకుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయమై తాము ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామన్నారు. దీనికి సంబంధించి ఆధారాలు కూడా ఇచ్చామన్నారు.