తెలంగాణ

విశ్వాసం కోల్పోకండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 1: ఇస్రో ప్రయోగించిన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పిఎస్‌ఎల్‌వి) విఫలమైందని నిరాశపడాల్సిన పనిలేదని, రెట్టించిన ఉత్సాహంతో వైఫల్యాలను సమీక్షించి ముందడుగు వేయాలని భారత అంతరిక్ష పరిశోధన సంస్ధ (ఇస్రో) పూర్వ చైర్మన్లు కె కసూర్తి రంగనాథన్, జి మాధవన్ నాయర్‌లు అభిప్రాయపడ్డారు. ఉపగ్రహాలను నింగిలోకి ప్రవేశపెట్టడంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్ధకు ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరుందన్నారు. ఈ వైఫల్యం నుంచి తొందరగా కోలుకుని పరిశోధనల్లో నిమగ్నం కావాలన్నారు. హీట్‌షీల్డ్‌లో తలెత్తిన సాంకేతిక వైఫల్యం వల్ల ఆగస్టు 31వ తేదీన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1హెచ్ ప్రయోగం విఫలమైందని కసూర్తి రంగనాథన్ అన్నారు. దీనిపై కూలంకషమైన విశే్లషణ అవసరమన్నారు. గతంలో కూడా ఈ తరహా సాంకేతిక వైఫల్యాలు తలెత్తాయన్నారు. అంతరిక్ష పరిశోధన తొలి దశల్లో అనేక ఉపగ్రహాల ప్రయోగాలు విఫలమైన సంగతిని ఆయన గుర్తు చేశారు. వైఫల్యం జరిగిన వెంటనే కృంగి పోకుండా పునస్సమీక్షించుకుని సరైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. అంతరిక్షంలో ప్రయోగమనేది ఎప్పుడూ సాహసం, సంక్లిష్టతతో కూడిన విషయమన్నారు. మన దేశంలోని అంతరిక్ష పరిశోధన సంస్ధలో అద్భుతమైన శాస్తవ్రేత్తలు ఉన్నారన్నారు. మన ముందు ఈ రంగంలో చేయాల్సిన అజెండా ఉందన్నారు. ఇస్రో పూర్వ చైర్మన్ జి మాధవన్ నాయర్ మాట్లాడుతూ పిఎస్‌ఎల్‌వి మంచి రికార్డు ఉందన్నారు. ఈ రంగంలో వైఫల్యాలు అసాధారణమేమీ కాదన్నారు. ప్రతి 40 ప్రయోగాలకు ఒక ఉపగ్రహం వైఫల్యమవుతోందన్నారు.