రాష్ట్రీయం

ఉద్యోగుల పోరుబాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 1: ఉద్యోగుల కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం (సిపిఎస్) రద్దుకు డిమాండ్ చేస్తూ శుక్రవారం రాష్టవ్య్రాప్తంగా నిర్వహించిన సామూహిక సెలవు విజయవంతమైంది. తెలంగాణ స్టేట్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయిస్ అసొసియేషన్ (టిఎస్‌సిపిఎస్‌ఇఎ) ఆధ్వర్యంలో రాష్టవ్య్రాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలతోపాటు రాజధానిలోని అన్ని ప్రధాన కార్యాలయాల ఎదుట ఉద్యోగులు సామూహిక సెలవుతోపాటు ధర్మ దీక్షా నిర్వహించారు. ఆందోళన విజయవంతమైందని టిఎస్‌సిపిఎస్‌ఇఎ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ తెలిపారు. సిపిఎస్ రద్దుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి సత్వర చర్యలు తీసుకోవాలని కోరుతూ అన్ని జిల్లాల్లో కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించామన్నారు. బంగారు తెలంగాణ సాధనకు పనిచేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ, సిబ్బంది సామాజిక భద్రత ప్రభుత్వాల బాధ్యతేనని స్థితప్రజ్ఞ అన్నారు. సర్వీస్‌లో మృతి చెందిన 262 మంది ఉద్యోగులతో పాటు కొత్త పెన్షన్ విధానం కింద రిటైరైన వెయ్యి కుటుంబాలకు వెంటనే డెత్ కమ్ రిటైర్‌మెంట్ గ్రాట్యుటీతో పాటు డిసేబిలిటీ గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్ ఇవ్వాలని స్థితప్రజ్ఞ డిమాండ్ చేశారు. తామిచ్చిన పిలుపుమేరకు 90 శాతం ఉద్యోగులు సామూహిక సెలవు పెట్టారన్నారు. కార్యక్రమంలో దాదాపు 32 శాఖలకు చెందిన ఉద్యోగులు పాల్గొన్నారని తెలిపారు. జిల్లా కేంద్రాలతో పాటు రాజధానిలో బూర్గుల రామకృష్ణారావు భవన్, పంచాయతీరాజ్ చీఫ్ సూపరిండెంట్ ఆఫీస్, గాంధీ హాస్పిటల్, పే అండ్ అకౌంట్స్ ఆఫీస్, రిజిస్ట్రేషన్ భవన్, జలసౌధ, వ్యవసాయ వర్శిటీ తదితర ప్రధాన కార్యాలయాల్లో ఆందోళన కార్యక్రమాలు పెద్దఎత్తున జరిగాయని స్థితప్రజ్ఞ తెలిపారు.

చిత్రం..సిపిఎస్‌పై నిర్వహించిన ఆందోళనలో ప్రభుత్వోద్యోగులు