రాష్ట్రీయం

ఇంటింటికీ నీళ్లూ.. నెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 1: మిషన్ భగీరథ పథకానికి టి-ఫైబర్ ప్రాజెక్టు అనుసంధానించి ఇంటింటికి మంచినీళ్లు, ఇంటర్ నెట్ సౌకర్యం కల్పించబోతున్నట్టు మున్సిపల్, ఐటీ మంత్రి కె తారకరామారావు వెల్లడించారు. టి-ఫైబర్ ప్రాజెక్టు ఫలాలను పట్టణాలు, నగరాలకు సైతం అందిస్తామన్నారు. వాటర్ పైపులైన్‌తోపాటు ఆఫ్టిక్ ఫైబర్ లైన్ వేయాల్సిందిగా అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రతీ మున్సిపాలిటీ, కార్పొరేషన్లతోపాటు వాటర్ వర్క్స్ ప్రాజెక్టులో భాగంగా చేపట్టనున్న పనుల్లో ప్రతి పైపులైన్‌తో పాటు ఇంటర్‌నెట్ లైన్లు వేయాలని, ఈమేరకు ఎంత మేరకు ఖర్చవుతుందో అంచనాలతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో టి-ఫైబర్‌తో విప్లవాత్మక మార్పులు వస్తాయని, గ్రామాల్లో నిర్ణీత లక్ష్యం ప్రకారం మిషన్ భగీరథ ప్రాజెక్టు పూర్తవుతుందన్నారు. ఒకవైపుమంచినీళ్లతో పాటు ఇంటింటికి ఇంటర్‌నెట్ సౌకర్యం కల్పించనుండటంతో మిషన్ భగీరథ అర్బన్ పనులతోపాటు టి-ఫైబర్ పనులనూ వెంటనే చేపట్టాల్సిన అవసరం ఉందని మంత్రి సూచించారు. బేగంపేటలో మున్సిపల్ ఇంజనీరింగ్ శాఖ (పబ్లిక్ హెల్త్) కార్యాలయంలో శుక్రవారం మున్సిపల్ అధికారులు, టి-ఫైబర్ ప్రాజెక్టు వర్కింగ్ ఏజెన్సీలతో మంత్రి సమావేశమయ్యారు. ఈ ప్రాజెక్టు అంతర్భాగంగా కార్పొరేషన్లలో నగర పర్యవేక్షణ కోసం సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీనికోసం నగరాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తామన్నారు. అర్బ న్ మిషన్ భగీరథ ప్రాజెక్టుతో పాటు టి-ఫైబర్ ప్రాజెక్టు సమన్వయం చేసుకోవడానికి ఐటీ, మున్సిపల్ అధికారులతో జాయింట్ వర్కింగ్ గ్రూపు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పైపులైన్ల నెట్‌వర్క్‌తో పాటు
ఇంటర్‌నెట్ కేబుల్ నెట్ వర్క్ డిజిటల్ మ్యాపులు సిద్ధం చేయాలన్నారు. పైపులైన్లతో పాటు డక్ట్ వేసేందుకు అయ్యే వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తుందని, ఈమేరకు లిఖిత పూర్వకంగా ఆదేశాలు జారీ చేస్తామని మంత్రి తెలిపారు. ప్రాజెక్టు కోసం ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూరె్తైందని, కొన్నిచోట్ల పనులు కూడా ప్రారంభమయ్యాయని చెప్పారు. ఈ మొత్తం ప్రాజెక్టు వచ్చే జూన్‌నాటికి పూర్తి చేయగలిగితే వచ్చే వేసవినాటికి పట్టణ, నగరాల ప్రజలకు ఇబ్బందులు తప్పుతాయన్నారు. ఇకనుంచి ప్రతీవారం అర్బన్ మిషన్ భగీరథపై సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నట్టు మంత్రి తెలిపారు.