ఆంధ్రప్రదేశ్‌

‘గణపతి’ పేరుతో దందా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), సెప్టెంబర్ 1: మావోయిస్టు నేత గణపతి పేరుతో డబ్బులు డిమాండు చేస్తూ పలువురిని బెదిరిస్తున్న నకిలీ మావోయిస్టును టాస్క్ఫోర్స్, పటమట పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డిసిపి గజరావ్ భూపాల్ వివరాలు వెల్లడించారు. గత కొద్దిరోజులుగా ఓ అగంతకుడు తాను మావోయిస్టు పార్టీకి చెందిన గణపతిని అని చెబుతూ పార్టీ ప్లీనరీ సమావేశాలు జరుగుతున్నాయని, చందాలు ఇవ్వాలంటూ నగరంలోని ప్రముఖులకు ఫోన్లు చేస్తున్నాడు. దీంతో బాధితులు పోలీసులకు సమాచారం అందించారు. సీపి గౌతం సవాంగ్ ఆదేశాలతో రంగంలోకి దిగిన టాస్క్ఫోర్స్, పటమట పోలీసులు దీనిపై దర్యాప్తు చేపట్టగా ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగు చూశాయి.
తెలంగాణా రాష్ట్రం కరీంనగర్ జిల్లా వీణవంక మండలం, కనపర్తి గ్రామానికి చెందిన పత్తి శ్రీనివాసరెడ్డి (35) అనే వ్యక్తి సుమారు ఆరేళ్ళ నుంచి తాను మావోయిస్టు పార్టీకి చెందిన వ్యక్తిగా ప్రచారం చేసుకుంటున్నా డు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని వ్యాపారులు, పారిశ్రామిక వేత్త లు, పలువురు ప్రముఖులకు ఫోన్లు చేసి డబ్బు లు డిమాండు చేస్తూ బెదిరిస్తున్నాడు. అయితే బాధితుల్లో కొందరు భయపడి అతను చెప్పిన బ్యాంకు ఖాతాలో డబ్బు డిపాజిట్ చేశారు. ఈక్రమంలో నకిలీ నక్సలైట్ మీద కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి. ఇదిలావుండగా 2014లో సదరు నకిలీ మావోయిస్టు కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్‌కి చెందిన పుట్టకుంట సతీష్ అనే వ్యాపారిని బెదిరించి 25వేలు డిమాండు చేయగా అతని ఫిర్యాదు మేరకు హనుమాన్ జంక్షన్ పోలీస్టేషన్‌లో 2014 ఆగస్టులో కేసు నమోదైంది.
ఈ కేసు ప్రస్తుతం నూజివీడు కోర్టులో విచారణలో ఉంది. అదేవిధంగా నకలీ మావోయిస్టుపై కరీంనగర్ జిల్లా వీణవంక పోలీస్టేషన్‌లో 2011లో రౌడీషీటు తెరిచినట్లు దర్యాప్తులో వెల్లడైంది. తర్వాత ఇతను మరి కొం దరితో కలిసి ఏపిలోని విశాఖపట్నం, అనకాపల్లి, రామచంద్రాపురం, కాకినాడ,అమలాపురం, చిత్తూరు, ఖమ్మం, నిడదవోలు, రాజమండ్రి ప్రాం తాల్లో ప్రముఖులకు ఫోన్లు చేసి, డబ్బు డిమాం డు చేయగా వీరిలో కొందరు భయంతో పెద్ద మొత్తంలో బ్యాకు ఖాతాలో డబ్బు జమ చేశారు. ఈక్రమంలో విజయవాడలో కూడా ఇతని బారిన పడిన కొందరు బాధితులు పదివేలు, 25వేలు, 50వేలు చొప్పున ముట్టచెప్పారు. ఈక్రమంలో నిందితుడిని గుర్తించిన పోలీసులు అరెస్టు చేసి సెల్‌ఫోన్లు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు డిసిపి తెలిపారు. విలేఖరుల సమావేశంలో టాస్క్ఫోర్స్ ఏసిపి పి మురళీధర్, పటమట ఎస్‌ఐ డి సత్యసుధాకర్ సిబ్బంది పాల్గొన్నారు.