రాష్ట్రీయం

రాష్ట్రంలో ఫ్లగ్-ఇన్ హైబ్రీడ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 2: రాష్ట్రంలో ఫ్లగ్-ఇన్ హైబ్రీడ్ వాహనాల తయారీ యూనిట్ ఏర్పాటుకు టయోటా కిర్లోస్కర్ సంస్థ ముందుకు వచ్చింది. ఇందుకు అవసరమైన సహకారం అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఉండవల్లిలోని సిఎం నివాసంలో టయోటా మేనేజింగ్ డైరెక్టర్ అకిటో టకిబానా శనివారం చంద్రబాబుని కలుసుకున్నారు. ఈ సంస్థ తయారు చేసే వాహనాలు ఇంజన్‌తో, ఎలక్ట్రికల్ చార్జింగ్‌తో కూడా పని చేస్తాయి. ఎలక్ట్రికల్ కార్లకు తక్కువ దూరం మాత్రమే ప్రయాణం, తరచూ చార్జింగ్ వంటి సమస్యలు ఈ ఫ్లగ్-ఇన్ హైబ్రీడ్ వాహనాలకు ఉండవు. ఈ వినూత్న ఆలోచనపై సిఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. ఇందుకు అవసరమైన వసతులు కల్పించేందుకు సిద్ధమని తెలిపారు. ప్రపంచశ్రేణి నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతున్నామని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తున్న తీరుపై ఆ సంస్థ ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారు. అమరావతి నగరాభివృద్ధిలో భాగస్వాములయ్యేందుకు తాము సిద్ధమని జపాన్ ప్రతినిధులు తెలిపారు. త్వరలోనే పూర్తి వివరాలతో వచ్చి, అవగాహనా ఒప్పందం చేసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో టయోటా జిఎం అత్సుషి, ఎపి ఎలక్ట్రానిక్స్ సిఇఒ తిరుమలరావు చామల్ల, తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయిన టయోటా కిర్లోస్కర్ సంస్థ ప్రతినిధులు