రాష్ట్రీయం

పల్లెలనుంచే పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, సెప్టెంబర్ 2: ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు చేపట్టనున్న పాదయాత్ర ముగిసేలోగా రాష్ట్ర రాజకీయాల్లో భారీమార్పులు చేర్పులు సంభవిస్తాయని వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వెల్లడించారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికే అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజును ఇడుపులపాయ నుంచి పాదయాత్ర చేపట్టనున్నట్టు ప్రకటించారు. శనివారం కడప జిల్లా పులివెందులలోని వైఎస్ ఆడిటోరియంలో వైఎస్ కుటుంబ కార్యక్రమం 9121091210 టోల్‌ఫ్రీ నెంబర్‌ను జగన్ ప్రారంభించారు. వైఎస్ కుటుంబంలో చేరాలనుకునేవారు ఈ టోల్‌ఫ్రీ నెంబర్‌కు మిస్డ్‌కాల్ ఇస్తే తమ కుటుంబంలో సభ్యునిగా చేర్చుకుంటామన్నారు. 2019లో తాము అధికారంలోకి రావడం తథ్యమని జగన్ అన్నారు. పార్టీ నేతృత్వంలో ఏర్పాటు చేసే గ్రామకమిటీలు గానీ, ఇతరత్రా ఏ కమిటీలతోగానీ జోక్యం లేకుండా గ్రామ సచివాలయాలతో ప్రభుత్వం నేరుగా సంప్రదింపులు జరిపి పరిపాలన కొనసాగిస్తుందన్నారు. ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా పరిపాలన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ జన్మభూమి కమిటీల పేరుతో తమ పార్టీ కార్యకర్తలకే సంక్షేమ పథకాలు అందజేస్తోందని జగన్ ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కమిటీల జోక్యం లేకుండా గ్రామ సచివాలయాల్లోనే అధికారాన్ని వికేంద్రీకరణ చేసి, సంక్షేమ పథకాలను అమలుచేస్తూ విప్లవాత్మక మార్పు తీసుకొస్తామన్నారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నట్లు జగన్ తెలిపారు. ఈనెల 11 నుంచి బూత్ కమిటీల ఏర్పాటు ద్వారా పార్టీ క్యాడర్‌లో ఉత్సాహం నింపి గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి
కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. ముందస్తుగా తాము ప్రకటించిన సంక్షేమ పథకాల్లో భాగంగా నవరత్నాలను గడప గడపకు తీసుకెళ్లే బాధ్యతను బూత్ కమిటీలకు అప్పగిస్తామన్నారు. పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించి అభివృద్ధి పథకాలను పర్యవేక్షిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తారన్నారు.
నంద్యాల శాసనసభ ఉప ఎన్నిక, కాకినాడ నగరపాలక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికార దుర్వినియోగం, విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేసి అక్రమాలకు పాల్పడి గెలుపొందిందని జగన్ ఆరోపించారు. సమావేశంలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, ఎమ్మెల్యేలు ఎస్‌బి అంజద్‌బాషా, ఎస్ రఘురామిరెడ్డి, పి రవీంద్రనాథరెడ్డి, జి శ్రీకాంత్‌రెడ్డి, కడప మేయర్ కె సురేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..ఇడుపులపాయలో తండ్రి వైఎస్సార్ సమాధి వద్ద నివాళి అర్పిస్తున్న వైకాపా అధినేత జగన్