రాష్ట్రీయం

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సదా.. ఆహ్వానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, సెప్టెంబర్ 2: ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అన్ని విధాలా ప్రభుత్వం సహకరిస్తుందని సిఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. చిత్తూరు జిల్లాలో పరిశ్రమలు స్థాపనకు అమెరికా ఫ్లోరిడా నుంచి వచ్చిన మ్యానుఫ్యాక్చరీ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఇనె్వస్టర్స్‌తో సిఎం శనివారం తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఐటి పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనకు వివిధ దేశాల నుంచి వచ్చే ప్రతినిధులకు ఎప్పుడూ ఆహ్వానం పలుకుతుందన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకున్న వారికి 21 రోజుల్లో పరిశ్రమల స్థాపనకు అనుమతులు ఇస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం అమెరికా ప్రతినిధుల తరపున కన్వల్‌దేవ్‌శ్రా మాట్లాడుతూ ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ నేపథ్యంలో సిఎం, ఐటి శాఖామంత్రికాని తమ దేశంలో పర్యటించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు, రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖామంత్రి అమరనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..రేణిగుంట విమానాశ్రయంలో అమెరికా ప్రతినిధులతో సమావేశమైన సిఎం చంద్రబాబు