రాష్ట్రీయం

మెగా కాళేశ్వరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 2: కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలో మెగా ప్రాజెక్టుగా చరిత్ర సృష్టించనుందని నీటిపారుదల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. డిసెంబర్ చివరినాటికి ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరుకు నీటి పంపింగ్ చేసేందుకు అన్ని ఏర్పాట్ల్లూ పూర్తి చేయాలని చెప్పారు. అతి తక్కువ సమయంలో ప్రాజెక్టు పూర్తి చేస్తే ఆ క్రెడిట్ ప్రభుత్వంతో పాటు ఏజెన్సీలకూ దక్కుతుందన్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి బిహెచ్‌ఇఎల్ ఉన్నతాధికారులు ప్రాజెక్టు సైట్‌ను సందర్శించి పంపుల ఎరక్షన్, టెస్టింగ్, కమిషనింగ్ పనుల పురోగతిని సమీక్షించాలని కోరారు.
ఈ మూడు నెలల వ్యవధి అత్యంత కీలకమైనందున ప్రతి పంపింగ్ స్టేషన్‌లోనూ అనుభవజ్ఞులైన ఇద్దరు సూపర్ వైజరీ అధికారులను నియమించాలదన్నారు. కాళేశ్వరం ప్యాకేజీ 6, 8 పంపింగ్ స్టేషన్లను షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. జలసౌధలో శనివారం ప్రాజెక్టు పనులపై బిహెచ్‌ఇఎల్, ఇరిగేషన్ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. మేఘా ఇంజనీరింగ్, నవయుగ సంస్థ ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు. ప్యాకేజీ 6 పంపింగ్ స్టేషన్‌లో తొలి పంపును ఈ ఏడాది డిసెంబర్ చివరినాటికి అమర్చాలని, రెండో పంపును 2018 జనవరి చివరినాటికి ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. మిగతా పంపులన్నింటినీ 2018 జూలై చివరినాటికి అమర్చాలని ఆదేశించారు. ఇక ప్యాకేజీ 8 పంపింగ్ స్టేషన్‌లో మొదటి పంపు కమిషనింగ్ ప్రక్రియ నవంబర్ నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. రెండో పంపు కమిషనింగ్ ప్రక్రియ డిసెంబర్ చివరికి పూర్తి కావాలన్నారు. ప్రతిష్టాత్మక కాళేశ్వరంను త్వరితగతిన పూర్తి చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని మేఘా, నవయుగ సంస్థలను మంత్రి ఆదేశించారు. అదే సమయంలో ట్రాన్స్‌కోతో సమన్వయం చేసుకొని సబ్ స్టేషన్‌ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని చెప్పారు. బిహెచ్‌ఇఎల్ ప్రతినిధులు నిరంతరం సమన్వయంతో పని చేస్తేనే షెడ్యూల్ ప్రకారం పనులు పూర్తవుతాయని మంత్రి చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం సాగునీటి కోసమే కాదని, మొదటి ప్రాధాన్యత కింద హైదరాబాద్ ప్రజల తాగునీటి అవసరాలను తీర్చనుందని మంత్రి గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టుతో మిషన్ భగీరథ పథకాన్ని అనుసంధానం చేసి 2017 డిసెంబర్ నాటికి తాగునీటి సరఫరా చేయనున్నట్టు చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు పంపు హౌజ్‌లు, బ్యారేజీలను షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయడం కూడా తెలంగాణకు అత్యంత ముఖ్యమని హరీశ్‌రావు తెలిపారు. ప్రాజెక్టును ఒక సవాలుగా తీసుకొని షెడ్యూల్ ప్రకారం పూర్తి చేసేందుకు పంపులు, మోటార్లు ఇతర సాంకేతిక పరికరాలు, యంత్రాలను వీలైనంత త్వరగా సమకూర్చుకోవాలని ఏజెన్సీలను కోరారు. యంత్ర పరికరాలన్నీ సకాలంలో సరఫరా చేయాలని బిహెచ్‌ఈఎల్‌ను కోరారు. బిహెచ్‌ఈఎల్ లెటర్ ఆఫ్ క్రెడిట్ సెప్టెంబర్ 10లోగా ఇవ్వాలని ఏజెన్సీలను మంత్రి కోరారు. వెంటనే బిహెచ్‌ఈఎల్ యంత్ర పరికరాలను రవాణా చేయాలని కోరారు. ప్రాజెక్టుకు సంబంధించి గడువుకు అనుగుణంగా చేపట్టవలసిన పనులపై కార్యాచరణ ప్రణాళిక ఖరారు చేయాలని మంత్రి ఆదేశించారు. సమావేశంలో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

చిత్రం..కాళేశ్వరం పనులపై ఉన్నతాధికారులు, బిహెచ్‌ఇఎల్ ప్రతినిధులతో సమావేశమైన హరీశ్‌రావు