రాష్ట్రీయం

బైసన్‌పోలో ఇస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: హైదరాబాద్ నగరంలో సెక్రటేరియట్ నిర్మాణానికి, మేడ్చల్ రహదారి, కరీంనగర్ రాజీవ్ రహదారి విస్తరణకు అవసరమైన రక్షణ శాఖ భూములను తెలంగాణకు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. సిఎం కెసిఆర్ శనివారం అరుణ్ జైట్లీతో చర్చలు జరిపిన అనంతరం ప్రభుత్వం ఈ విషయం తెలిపింది. నీటిపారుదల ప్రాజెక్టుల వంటి ప్రజాప్రయోజన పథకాలపై విధించిన జిఎస్టీని తగ్గించేందుకూ జైట్లీ అంగీకరించారు. ఈమేరకు తగు ఉత్తర్వులు జారీ చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. రక్షణ శాఖ భూముల కోసం రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే చేసిన విజ్ఞప్తిని అన్ని కోణాల్లో పరిశీలించి, స్థలాలు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నామని జైట్లీ తెలిపారు. మేడ్చల్ ఎన్‌హెచ్, కరీంనగర్ రాజీవ్ రహదారి విస్తరణకు అవసరమైన రక్షణ శాఖ భూమి కేటాయిస్తామని జైట్లీ హామీ ఇచ్చినట్టు ప్రభుత్వం తెలిపింది. తగిన భూములు ఇచ్చేందుకు రక్షణ శాఖ అంగీకరించడంపట్ల కేంద్రం, మంత్రి అరుణ్ జైట్లీకి కెసిఆర్ కృతజ్ఞతలు తెలిపారు. మేడ్చల్ ఎన్‌హెచ్, రాజీవ్ రహదారిని విస్తరణ అవసరాన్ని కేంద్రం గుర్తించింది కనుకే, ఇందుకు సంబంధించిన భూమి కేటాయిస్తున్నారని కెసిఆర్ తెలిపారు. నీటిపారుదల ప్రాజెక్టులవంటి ప్రజాప్రయోజన పథకాలపై జిఎస్టీని తగ్గించే విషయంపై సెప్టెంబర్ 9న హైదరాబాద్‌లో జరిగే సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రి జైట్లీ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు తెలిపారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి మేరకు నిర్మాణ పనులపై జిఎస్టీ 18 నుంచి 12 శాతానికి తగ్గించామని జైట్లీ తెలిపారు. 12శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించే విషయంలోనూ తగు నిర్ణయం తీసుకుంటామని జైట్లీ చెప్పారు. రక్షణ శాఖ భూముల అప్పగింత, జీఎస్టీ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించినందుకు అరుణ్ జైట్లీలకి సిఎం కెసిఆర్ కృతజ్ఞతలు తెలిపారు. కొత్త సచివాలయం నిర్మాణం, రహదారుల విస్తరణ ఆవశ్యకతను కేంద్రం గుర్తించిందన్నారు. జీఎస్టీపై హైదరాబాద్‌లో 9న జరిగే సమావేశంలో సముచిత నిర్ణయం తీసుకుంటారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. జైట్లీ, కెసిఆర్‌ల భేటీకి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, సిఎం ముఖ్య కార్యదర్శి ఎస్ నర్సింగ్‌రావు హాజరయ్యారు.