రాష్ట్రీయం

భూముల రీ సర్వే ఆషామాషీ కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 2: భూముల రీ-సర్వేను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించింది. భూముల రీ-సర్వే ఆషామాషీగా పూర్తిచేసి చేతులు దులుపేసుకోవద్దని సర్కారు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తోంది. సర్వే సమగ్రంగా నిర్వహించి భవిష్యత్ తరాలకు ఇబ్బందులు తలెత్తకుండా, రికార్డులు చెక్కు చెదరకుండా డిజిటలైజేషన్ చేయాలని సిఎం చంద్రశేఖర్ రావు అధికారులకు ఆదేశాలిచ్చారు. దీంతో రంగంలోకి దిగిన సర్వే అధికారులు తొలుత పైలట్ ప్రాజెక్టుగా రంగారెడ్డి జిల్లాలోని తుర్కగూడ, ఎర్రగుంటలో, సిద్దిపేట జిల్లాలోని దౌలాపూర్‌లో సమగ్ర సర్వే నిర్వహించారు. రెవెన్యూ, వ్యవసాయ, సర్వే శాఖల ఉన్నతాధికారులు సర్వేలో పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లాలోని రెండు గ్రామాల్లో 310 ఎకరాల వ్యవసాయ భూమిలో అత్యంత ఆధునిక పద్ధతిలో ‘డిజిపిఎస్’ (డిప్రెన్షల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం) ద్వారా సర్వే
చేశారు. డిజిపిఎస్‌తో పాటు ఇటిఎస్ (ఎలక్ట్రానిక్ టోటల్ స్టేషన్)ను, ఇంకా శాటిలైట్ ఇమేజస్ ద్వారా సర్వే పూర్తి చేయడానికి చర్యలు ముమ్మరం చేశారు.
అయితే ఏరియల్ సర్వే ద్వారా ఎదురయ్యే సమస్యల పట్ల అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏరియల్ ఫొటోగ్రఫీకి ప్రధానంగా కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి పొందాల్సి ఉంటుందని, పైగా ఫొటోగ్రఫీ సర్వేకు ప్రధానంగా వర్షాకాలం, ఆకాశం మేఘావృతమై ఉంటే ఉపయోగం ఉండదన్న అనుమానాలూ వ్యక్తం చేస్తున్నారు. శాటిలైట్, డిజిపిఎస్ పద్ధతుల సర్వే కంటే ఏరియల్ సర్వే ఫొటోగ్రఫీ స్పష్టత ఉండదన్న వాదనా వినిపిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లావంటి కొన్ని జిల్లాల్లో ఎతె్తైన కొండలు ఉండటం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. కరీంనగర్ జిల్లాలో భూమి ఎత్తుపల్లాలు లేకుండా ఉంటుంది. ఇక 10,800 గ్రామాల్లో ల్యాండ్ సర్వే చేపట్టి, 86,000 చదరపు కిమీ. రికార్డుల ఆధునీకరణ కార్యక్రమాల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయంచింది.
డిసెంబర్‌లోగా పూర్తి
భూముల రీ సర్వే, డిజిటలైజేషన్‌ను డిసెంబర్‌లోగా పూర్తి చేయాలని సిఎం కెసిఆర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఏవైనా తప్పులుంటే సరి చేసుకోవచ్చని సిఎం సూచించినట్టు సమాచారం.